Malla Reddy Met DK Siva Kumar: మొన్న కేసీఆర్ తో భేటీ అయిన మల్లారెడ్డి.. బీఆర్ఎస్ కు షాక్ ఇచేలా ఇచ్చేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరడాన్ని సీఎం రేవంత్ అడ్డుపడడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో భేటీ అయ్యారు మల్లారెడ్డి. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.
రేవంత్ దూకుడు.. మల్లారెడ్డికి చుక్కలు..
మల్లారెడ్డికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఓటమి చెందడం ఒక షాక్ అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇందుకు కారణం గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఆయన అక్రమ నిర్మాణాలను రేవంత్ సర్కార్ కూల్చి వేయడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో (Congress) చేరుతాననని చెప్పిన ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం లేదట. మరోవైపు జాతీయ పార్టీ అండ ఉంటుందని భవిస్తూ బీజేపీ నేతలతో సంప్రదింపులు చేశారట మల్లారెడ్డి. తన కుమారుడికి మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇస్తే బీజేపీలో చేరుతానని కూడా అన్నారట. దీనికి బీజేపీ నో చెప్పడంతో చేసేది ఏమి లేక తిరిగి గులాబీ బాస్ కేసీఆర్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయాలపై వివరణ ఇచ్చినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.
ALSO READ: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి?
ఇటీవల కేసీఆర్ తో భేటీ..
ఇటీవల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఆయన కొడుకు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి నందినగర్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. ఆక్రమణల్లో నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్‌తో చర్చించారు. అలాగే మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారంపై కేసీఆర్ అరా తీసినట్లు సమాచారం. దీనిపై కేసీఆర్ కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని.. తన కొడుక్కి ఎంపీ టికెట్ కూడా అవసరం లేదని ఆయన కేసీఆర్ కు తెలిపినట్లు సమాచారం.