వైసీపీ(YCP) ఇన్‌ఛార్జిల లిస్ట్ రిలీజ్ చేస్తున్న కొద్దీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు షాక్‌లు తగులుతున్నాయి. సీటు గ్యారెంటీ అని ఫిక్స్ అయినా వాళ్లలో చాలా మందికి జగన్(Jagan) షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. గెలుపు గుర్రాలకే తప్ప ఏ విషయంలోనూ సీఎం కాంప్రామైజ్ అవ్వడంలేదని తెలుస్తోంది. రిపోర్ట్ సరిగ్గా లేని ఎమ్మెల్యేల లిస్ట్ ఎంత పెద్దదైనా సరే పక్కన పెట్టేందుకు వెనుకాడడం లేదని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిల సెకండ్ లిస్ట్ విడుదుల చేసింది. ఈ లిస్ట్‌లో విజయవాడ సెంట్రల్(Vijayawada Central) ఇన్‌ఛార్జిగా వెల్లంపల్లిని నియమించింది. దీనిపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
అనుచరుల హంగామా:
విజయవాడ సెంట్రల్ వైసీపీలో సీట్ రచ్చకు దారి తీసింది. సెంట్రల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు(Malladi Vishnu)కు వైసీపీ షాక్ ఇచ్చింది. సెంట్రల్ ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లి(Vellampalli)ని నియమించడంతో అధిష్టానం నిర్ణయంతో మల్లాది విష్ణు అనుచరుల ఆందోళన చేస్తున్నారు. బందరు రోడ్డులో హంగామా చేశారు విష్ణు అనుచరులు. విష్ణుకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అటు కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పార్టీ మారుతారా?
మల్లాది విష్ణు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (INC)తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాంలో విజయవాడకు విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వుడా) చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత మల్లాది విష్ణు YSRCP (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)కి మారారు.2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన మల్లాది విష్ణు.. తనకు విజయవాడ సెంట్రల్ టికెట్ దక్కే అవకాశం లేదని అర్థమవుతుండడంతో మరోసారి కాంగ్రెస్ గూటికే చేరుతారానన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులోనూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు, సీఎం జగన్ చెల్లి, YSRTP అధినేత్రి షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తుండడంతో పాటు ఏపీ వైపే ఫోకస్ పెడతారన్న ప్రచారం సమయంలో విష్ణు మళ్లీ తిరిగి హస్తం గూటికే చేరే అవకాశాలను కొట్టిపారేయలేం.
Also Read: అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు..షేర్లపై ప్రభావం చూపనుందా?
WATCH: