Etela Rajender: తాను ఎన్ని జన్మలు ఎత్తినా మల్కాజ్ గిరి ప్రజల రుణం తీర్చుకోలేనని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజ్ గిరి ఎంపీగా ఘన విజయం సాధించిన సందర్భంగా ఆర్టీవీతో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నోరుందని, మీడియాలో వార్తలు వస్తాయని ఏది పడితే అది మాట్లాడడం సరికాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. బీఆర్ఎస్, కేసీఆర్ పై ప్రజలకు ఇంకా కోపం చల్లారలేదన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందా? రాదా అన్న విషయం తెలియదన్నారు. ఈటల పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
Also Read: నటి హేమకు షాక్ ఇచ్చిన ‘మా’ అసోసియేషన్.. సభ్యత్వం రద్దు!