Breaking: జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌ బాధపడుతున్నారు.శుక్రవారం ఉదయం ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు.

New Update
Breaking: జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!

Breaking: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు.

జిట్టా బాలకృష్ణ రెడ్డి 14 డిసెంబర్ 1972న యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1987లో బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్ పూర్తి ఇచేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1993లో డివీఎం డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల నుంచి బి.కామ్‌లో గ్రాడ్యుయేషన్‌లో పూర్తి చేశారు.

జిట్టా బాలకృష్ణ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పని చేశారు. ఆయన టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో బాగంగా టీడీపీకి ఆ స్థానం దక్కడంతో ఆయన ఆ పార్టీని విడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ లోక్‌సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని విడి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇక 2023 అక్టోబర్ 20న బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

Also Read: బుడమేరు గండ్లు పూడ్చివేతకు రంగంలోకి ఆర్మీ!

Advertisment
తాజా కథనాలు