Malayalam Industry: మలయాళ సినీ ఇండస్ట్రీలో పెద్ద కుదుపు.. ఆ రిపోర్టుపై సిట్ ఏర్పాటు!

మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. అలాగే పలువురు అగ్ర నటులపై వచ్చిన ఆరోపణలు దూమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది.

Malayalam Industry: మలయాళ  సినీ ఇండస్ట్రీలో పెద్ద కుదుపు.. ఆ రిపోర్టుపై సిట్ ఏర్పాటు!
New Update

Malayalam Industry: 2017లో నటి భావనపై లైంగిక దాడి ఘటన తర్వాత.. అప్పటి కేరళ ప్రభుత్వం మలయాళ ఇండస్ట్రీలో మహిళా పై వేధింపులకు సంబంధించి ఓ రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవలే హేమా కమిటీ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మలయాళ సినీ పరిశ్రమలో మహిళా నటులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, కాస్టింగ్ కౌచ్ కూడా చాలా ఎక్కువే ఉన్నట్లు ఈ నివేదిక చెప్పింది. కమిట్ మెంట్ పేరుతో మహిళా నటులను వేధిస్తున్నట్లు హేమా కమిటీ తెలిపింది. పలువురు సాక్ష్యాలు, చెప్పిన వివరాల ప్రకారం ఇన్వెస్టిగేషన్‌లో ఈ విషయాలు బయపడినట్లు కమిటీ పేర్కొంది.

సిట్ దర్యాప్తు 

ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారిని నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన పోలీసు ఉన్నతాధికారుల జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది ఇలా ఉంటే నటి రేవతి మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ పై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిద్ధిఖీ తనను రేప్ చేశాడని, అలాగే తన స్నేహితులను కూడా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో సిద్ధిఖీ మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే ఈ విషయం పై స్పందిస్తానని చెప్పారు. అలాగే తన రాజీనామా లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్ కు అందించారు.

Also Read: MollyWood: మాలీవుడ్‌లో మహిళలకు నరకమే..హేమ కమిటీ రిపోర్ట్‌లో ఆశ్చర్యకర అంశాలు - Rtvlive.com

#hema-committee #malayalam-industry
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe