Actress Soumya : హేమా కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మహిళలపై నటులు, దర్శకులు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడటం ఇండస్ట్రీ అంతా చర్చనీయాంశం అయింది. ఇలాంటి తరుణంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడిని ఉద్దేశించి నటి సౌమ్య కీలక ఆరోపణలు చేశారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.." సినిమాల్లోకి అడుగుపెట్టాలని చిన్నప్పటినుంచే కలలు కన్నా. 18 ఏళ్ల వయసులో తెలిసిన వారి ద్వారా సినిమా అవకాశం వచ్చింది. దర్శకుడు నచ్చజెప్పడంతో ఇంట్లోవాళ్లు సుముఖత వ్యక్తంచేశారు. మొదటి మీటింగ్‌లోనే అతడి ప్రవర్తన నాకు నచ్చలేదు. కొంతకాలానికి అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
Also Read : వరద బాధితులకు వరుణ్ తేజ్ విరాళం..
వాళ్లావిడ పక్కన లేని సమయం చూసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాదాపు ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. అతను నన్నొక శృంగార బానిసగా చూశాడు. ఆ సమయంలో నా బాధను ఎవరితోనూ చెప్పలేకపోయా" అని అన్నారు. అయితే తనను లైంగికంగా వేధించిన డైరెక్టర్ పేరు మాత్రం నటి సౌమ్య వెల్లడించలేదు.