Guntur Kaaram: చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్‌.. మేకింగ్‌ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్‌!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా చిత్ర బృందం గుంటూరు కారం మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది.

New Update
Guntur Kaaram:  చేతిలో బీడీ.. కళ్లలో ఫైర్‌.. మేకింగ్‌ వీడియోలో పూనకాలు తెప్పించిన మహేశ్‌!

Guntur Kaaram Making Video:  ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ లో 'గుంటూరు కారం' ఒకటి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన గుంటూరు కారం బజ్ విపరీతంగా నడుస్తోంది. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా జనవరి 12 న థియేటర్స్ లో విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇటీవలే చిత్ర బృందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. దీంతో రిలీజ్ కు ముందే సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలను ఏర్పర్చుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ మామూలుగా వైరల్ అవ్వలేదు. ప్రతీ ఒక్కరు ఈ పాట పై రీల్స్, డాన్స్ లు చేస్తూ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు.

గుంటూరు కారం మేకింగ్ వీడియో

ఇక తాజాగా సినిమా మరి కొద్దీ గంటల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినిమాకు మరింత హైప్ పెంచేలా గుంటూరు కారం మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మేకింగ్ వీడియో చూసి మహేష్ అభిమానులు మరింత ఖుష్ అవుతున్నారు. కొన్ని ఫైట్ సీన్స్ చిత్రీకరణలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించారు. మాస్ ఫ్యాన్స్ కు మాస్ మసాలా ఎంటర్ టైన్మెంట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మేకింగ్ వీడియో చూస్తే థియేటర్స్ లో మరో సారి మహేష్ బాబు దుమ్ము లేపనున్నట్లు అర్థమవుతుంది.

publive-image

Also Read: Sarkari Naukri OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సర్కారు నౌకరి’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

గుంటూరు కారంలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అతడు, ఖలేజ తర్వాత మాటల మాంత్రికుడు, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో అభిమానులు సినిమా పై మరింత ఆసక్తిగా ఉన్నారు. గుంటూరు కారం సినిమాను హారిక, హాసిని బ్యానర్ పై రాధ కృష్ణ నిర్మిస్తున్నారు.

publive-image

Also Read: Guntur Kaaram Song: “మావ ఎంతైనా”.. గుంటూరు కారం నుంచి మరో దుమ్ము లేపే సాంగ్

Advertisment
తాజా కథనాలు