RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ నటించిన భారతీయుడు చిత్రం సీక్వెల్ భారతీయుడు 2 కూడా పూర్తి చేసే పనిలో ఉండడంతో.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కాస్త ఆలస్యంఅయ్యే అవకాశం ఉంది. ఇక ఈ గ్యాప్ లో చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా ఒకే చేశారు. గేమ్ చేంజర్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ 16 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా RC16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇక తాజాగా చిత్ర బృదం రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్వరలోనే RC16 సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రాంచరణ్ తో కలిసి నటించే అవకాశం
రామ్ చరణ్ 16 వ చిత్రంగా రాబోతున్న RC16 లో కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. టాలెంట్ హంట్ కోసం ఉత్తరాంధ్రకు వస్తున్నాము. ఉత్సాహం ఉన్న నటీనటులందరూ ఎంతో ప్రత్యేకంగా ఉండబోయే ఈ సినిమాలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి. ఫిబ్రవరిలో విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఆడిషన్స్ జరగనున్నాయని ట్విట్టర్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరిన్ని వివరాల కోసం rc16Casting@VriddhiCinemas.com ఈమెయిల్ ఐడీనీ సంప్రదించాలని తెలియజేశారు. రాంచరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకునే సామాన్యులకు ఇది ఒక సువర్ణ అవకాశమనే చెప్పాలి. నటీ నటుల కోసం వేట మొదలు పెట్టడంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.
Also Read: Bigg Boss Sohel: యాంకర్ సుమ చేసిన పనికి.. ఎమోషనల్ అయిన సోహైల్
Also Read: Chiranjeevi: పద్మ విభూషణ్ చిరంజీవికి అభినందనలు తెలిపిన.. హీరో తరుణ్ ఫ్యామిలీ