Beetroot LipBalm: ఇంట్లోనే బీట్‌రూట్ నుంచి లిప్ బామ్ ఇలా తయారు చేసుకోండి మీ పెదాలు అందంగా మారతాయి

పెదాలను అందంగా మార్చుకోవడానికి అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. ఇంట్లోనే బీట్‌రూట్ నుంచి లిప్ బామ్‌ను తయారు చేసింది వాడితే పెదాలు అందంగా, మృదువుగా ఉంటాయి. బీట్‌రూట్‌ లిప్‌బాబ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Beetroot LipBalm: ఇంట్లోనే బీట్‌రూట్ నుంచి లిప్ బామ్ ఇలా తయారు చేసుకోండి మీ పెదాలు అందంగా మారతాయి

Beetroot Lip Balm: బీట్‌రూట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలన్నింటినీ తొలగించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. దాని సహాయంతో ఇంట్లోనే లిప్‌బామ్ తయారు చేసుకోవచ్చు. పెదాలను అందంగా మార్చుకోవడానికి అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ చాలా మంది దీని గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఇప్పుడు ఇంట్లోనే బీట్‌రూట్ నుంచి లిప్ బామ్‌ను తయారు చేసుకోని వాడుకుంటే పెదాలు అందంగా, మృదువుగా చేసుకోవచ్చు. ఇంట్లో బీట్‌రూట్‌ లిప్‌బాబ్‌ను ఎలా తయారు చేసుకోవాలో దానిపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్‌రూట్‌ లిప్‌బాబ్‌ తయారీ విదానం:

  • బీట్‌రూట్ రసం, వాసెలిన్ రెండింటినీ ఒక పాత్రలో కలనాలి. తరువాత తక్కువ మంట మీద 5 నిమిషాలు వేడి చేసి, అందులో విటమిన్ ఇ క్యాప్సూల్, కొబ్బరి నూనె కలుపుకోవాలి.
  • ఈ పేస్ట్‌ను బాగా కలిపిన తర్వాత.. పొడి పాత్రలో ఉంచాలి. ఆపై ఈ పాత్రను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి చల్లబరచాలి.
  • పేస్ట్ చల్లారిన తర్వాత మీరు దానిని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించే ముందు.. ప్యాచ్ టెస్ట్ చేయాలని గుర్తుంచుకోవాలి
  • కొందరికి ఈ లిప్ బామ్ వల్ల ఎలర్జీ రావచ్చు. ఇది జరిగితే.. ఖచ్చితంగా మంచి ఆరోగ్య వైద్యుడిని సంప్రదిచాలి.

ఇది కూడా చదవండి: ఎండల ఎఫెక్ట్.. తరగతి గదినే స్విమ్మింగ్ పూల్ చేసేసిన టీచర్స్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు