మహీంద్రా ఎక్స్యూవీ 700 2021 ఆగస్టులో లాంచ్ అయినప్పటి నుండి భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో చాలా బలమైన ప్లేయర్ గా అవతరించింది. గత మూడేళ్ళుగా, అనేక మంది కొత్త ప్రత్యర్థులు కూడా తెరపైకి వచ్చినప్పటికీ దాని ప్రజాదరణను చాలావరకు నిలుపుకోగలిగింది. మహీంద్రా ఎక్స్యూవీ 700 కోసం వెయిటింగ్ పీరియడ్ ఇటీవలి కాలంలో తగ్గింది. ఈ మోడల్ ఉత్పత్తి కొంతవరకు పెరిగింది.
మహీంద్రా నుండి వచ్చిన ఎక్స్ యూవీ 700 మంచి రోడ్ ప్రజన్స్ ను కలిగి ఉంది. ఇది రెండు, మూడు వరుస ఎంపికలలో వస్తుంది. దీని ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఈ ఎస్ యూవీకి మరింత స్టైల్ ను తీసుకువచ్చాయి. ఈ ఎక్స్ యూవీ 700 మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి ఏడు సింగిల్ టోన్, ఐదు డ్యూయల్ టోన్ రంగులు. ఇందులో స్పోర్టీ అల్లాయ్స్ వీల్స ఆకర్షణీయంగా ఉంటాయి.
మహీంద్రా ఎక్స్ యూవీ 700 ఒక ఫీచర్ లోడెడ్ ఎస్ యూ వీ. ఇది అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇందులో 10.24 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, పనోరమిక్ సన్ రూఫ్, 3 డి సౌండ్ సిస్టమ్, ఎయిర్ ఫిల్టర్, ఏడీఏఎస్ లేదా అడ్వాన్స్ డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.