Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'గుంటూరు కారం'. ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా మార్పులు చేర్పులు జరిగిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హేగ్డే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల పూజ హేగ్డే ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో కీలక మార్పు చేసినట్లు తెలిసింది. సినిమా ప్రారంభంలో ఉన్న టెక్నీషియన్స్ , నటీ నటులు చాలా మంది ఇప్పుడు లేరు. అందులో ఒకరు సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన పి. ఎస్ వినోద్ పలు కారణాల వల్ల సినిమా మధ్యలోనే తప్పుకున్నారు.
మూవీ మధ్యలోనే సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం సినిమాకు పెద్ద సమస్యనే చెప్పొచ్చు. సాధారణంగా ఒక సినిమాటోగ్రాఫర్ మధ్యలో వదిలేసిన సినిమాను ఇతర టెక్నీషియన్స్ కమిట్ అవ్వడం చాలా కష్టం. కానీ 'గుంటూరు కారం' విషయంలో ఇది జరగలేదు. ఈ సినిమాకు పని చేయడానికి మరో స్టార్ సినిమాటోగ్రాఫర్ వచ్చారు. ఆ స్టార్ సినిమాటోగ్రాఫర్ మరెవరో కాదు కోలీవుడ్ తో పాటు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు తన సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంస ఈ సినిమా కోసం వచ్చారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే మనోజ్ పరమహంస ఈ సినిమా కమిట్ అవ్వడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే మనోజ్ పరమహంస ఓ చిట్ చాట్ లో.. ఎన్నో ఏళ్ళుగా అనుబంధం ఉన్న థమన్ గుంటూరు కారం సినిమాను టేకోవర్ చేయాలంటూ అడగగా కాదనలేకపోయానని పేర్కొన్నాడు.
థమన్ మాట్లాడటం వల్లే అటువంటి స్టార్ సినిమాటోగ్రాఫర్ ఈ సినిమా కోసం వర్క్ చేయడానికి ఒప్పుకున్నారని, ఒకవేళ థమన్ తనకెందుకులే అనుకుని ఉంటే 'గుంటూరు కారం' చిత్ర యూనిట్ ఈ విషయంలో సమస్యలు ఎదుర్కొనేదని సినీ విశ్లేషకుల అభిప్రాయం.