Guntur Kaaram: ఓరీ మీ దుంపలు తెగ..మొత్తం లీక్‌ చేసేస్తున్నారుగా..ఆగండిరా స్వామి!

గుంటూరు కారం సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. తాజాగా ఈ సినిమా నుంచి హీరో మహేష్‌ బాబు, హీరోయిన్‌ శ్రీలీల కు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యాయి. వీటిని చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Guntur Kaaram: ఓరీ మీ దుంపలు తెగ..మొత్తం లీక్‌ చేసేస్తున్నారుగా..ఆగండిరా స్వామి!

Guntur Kaaram Leaks: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram) శ్రీనివాస్‌ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం(Guntur Kaaram). వీరి కాంబో కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి కూడా ఏదోక అడ్డంకి ఏర్పడుతు ఉందనే చెప్పవచ్చు. ముందుగా అనుకున్న హీరోయిన్‌ పూజా హెగ్డే.

ఏమైందో ఏమో తెలియదు ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్‌ లోకి శ్రీలీల(Sreeleela) వచ్చి చేరింది. రెండో హిరోయిన్‌ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. దీనిని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌ పై చినబాబు , సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ఏ ముహూర్తానా మొదలైందో కానీ..అప్పటి నుంచి కూడా సినిమాని లీకుల బెడద వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే చాలా సార్లు ఆడియో సాంగ్స్‌ లీకు అవుతుంటే...ఇంకొన్ని సార్లు షూటింగ్‌ వీడియోస్ లీక్‌ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం సినిమా నుంచి ధం మసాలా బిర్యానీ ఆడియో నెట్టింట్లో ప్రత్యక్షం కావడంతో వెంటనే మేకర్స్‌ అధికారికంగా ఆ సాంగ్‌ ను విడుదల చేశారు.

తాజాగా సినిమా నుంచి ఓ మాస్‌ సాంగ్‌ కు సంబంధించిన షూటింగ్‌ వీడియో లీక్‌ అయ్యింది. ఇందులో శ్రీలీల చీరకట్టులో కనిపిస్తుండగా..మహేష్‌ మంచి ఫ్యాన్సీ లుక్‌ లో ఉన్నాడు. వారు ధరించిన దుస్తుల బట్టి ఇది మాస్‌ సాంగ్‌ లా అనిపిస్తుంది. ఈ లీక్‌డ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

దీంతో దీనిని సోషల్‌ మీడియాలో చూసిన అభిమానులు మండిపడుతున్నారు. రేయ్‌..రేయ్‌ సినిమా మొత్తం లీక్‌ చేసి పడేస్తున్నారు కదరా..అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం మానేస్తారని అంటున్నారు.

అయినా సరే కొందరు వ్యూస్‌ కోసం, లైక్స్‌ కోసం ఇలాంటి వీడియోస్‌ ని షేర్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్‌ సినిమా నుంచి ఏ లీక్‌ లు రాకుండా జాగ్రత్త పడితే బాగుంటుందని కొందరు చెప్తున్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also read: పీరియడ్స్ నొప్పి భరించలేక…గర్భనిరోధక మాత్రలు వేసుకున్న బాలిక..ఎంత పనైంది..!!

Advertisment
తాజా కథనాలు