Mahesh Babu: తల్లి చివరి కోరిక నెరవేర్చబోతున్న మహేష్..?!

1

New Update
Mahesh Babu: తల్లి చివరి కోరిక నెరవేర్చబోతున్న మహేష్..?!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఇంట్లో శుభకార్యం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. ఈ శుభకార్యం వెనుక మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కోరిక ఉన్నట్లుగా సమాచారం. గత ఏడాది మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి చనిపోయారు. అయితే ఇందిరా దేవి బ్రతికుండగా మహేష్ కూతురు సీతారకు ఓణీ ఫంక్షన్ చేయాలనీ కోరుకున్నారట. కానీ అప్పుడు మహేష్ ఆ ఫంక్షన్ చేయలేకపోయారట.

publive-image

ప్రతి ఆడపిల్లకు జరిగే మొట్ట మొదటి పండుగ ఓణీ ఫంక్షన్. ఇప్పుడు సితారకు 11 ఏళ్ళు ఓణీల ఫంక్షన్ చేయడానికి ఇదే కరెక్ట్ సమయమని భావిస్తున్నారట మహేష్. తల్లి ఇందిరాదేవి చివరి కోరిక మేరకు సితారకు ఓణీల ఫంక్షన్ చేయనున్నారని సమాచారం. ఘట్టమనేని కుటుంబంలో జరగబోయే మొదటి శుభకార్యాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక సితార చిన్నప్పటి నుంచే సెలెబ్రెటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన డాన్స్ వీడియోస్ ను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోది సితార. అంతే కాదు చిన్న వయసులోనే చారీటీలు చేస్తూ అభిమానుల నుంచి తండ్రికి తగ్గ తనయ అనే ప్రశంశలను కూడా పొందింది. మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమాలో 'పెన్నీ పెన్నీ' సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ బిల్‌ బోర్డ్‌ పై PMJ యాడ్ లో సితార కనిపించింది.  మహేష్ బాబు ఈ యాడ్ కు సంబందించిన వీడియోను షేర్ చేసి చాలా గర్వంగా ఉందని సోషల్ మీడియా వేదిక పై ఆనందం వ్యక్తం చేశారు.

publive-image

Also Read: Varun, Lavanya Wedding: వరుణ్, లావణ్య పెళ్లి కోసం ఇటలీకి పవర్ స్టార్ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు