Maharashtra: ఆమె వయసు 17 ఏళ్లే.. చేసే పని చూసి పోలీసులే షాక్.. నవీ ముంబైలో ఓ హోటల్‌లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు ముంబై పోలీసులు. అయితే, ఈ వ్యభిచార కూపాన్ని నడుపుతోంది 17 ఏళ్ల వయసున్న ఓ అమ్మాయి అని గుర్తించి పోలీసులే షాక్ అయ్యారు. ఆమెను అరెస్ట్ చేయడంతో పాటు.. నలుగురు యువతను కాపాడారు. By Shiva.K 08 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Maharashtra: చూసేందుకు చిన్న అమ్మాయే.. కానీ చేసే పని మాత్రం పెద్దలు కూడా భయపడేలా ఉంటుంది. ఆ అమ్మాయి ఏకంగా వ్యభిచార కూపాన్ని నిర్వహిస్తోంది. ముంబై(Mumbai) పోలీసులు జరిపిన ఆకస్మిత దాడుల్లో యువతి గుట్టు రట్టయ్యింది. నవీ ముంబైలోని ఓ హోటల్‌లో 17 ఏళ్ల మహిళ నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. నలుగురు మహిళలను ఆ మాయదారి కూపం నుంచి రక్షించారు. వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న యువతిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పక్కా సమాచారం మేరకు, పోలీసుల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ బృందం ముంబైలోని వాషి ప్రాంతంలో ఉన్న హోటల్‌పై దాడి చేశారు. డెకామ్ కస్టమర్‌ను అక్కడికి పంపి ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకున్న తరువాత.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి యువతిని, బాధితులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న యువతిని ముంబైలోని మలాడ్‌కు చెందిన యువతిగా గుర్తించారు పోలీసులు. వ్యభిచారం ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని బాధిత మహిళలకు ఇచ్చి.. మిగిలిన డబ్బులను తన వద్దే ఉంచుకునేదని పోలీసులు తెలిపారు. హోటల్‌పై దాడి చేసిన పోలీసులు.. నలుగురు మహిళలను సేవ్ చేశారు. అందరూ 20 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు. వీరిలో నేపాల్‌కు చెందిన ఒకరు, బీహార్‌కు చెందిన ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. వీరిని పునరావాస గృహానికి తరలించారు అధికారులు. కాగా, నిందితురాలి వద్ద నుంచి ఖరీదైన మొబైల్ ఫోన్, వాచ్, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే, రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ విలువైన ఫేక్ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 370, అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం-1956 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Also Read: బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ మంచిదా? వైట్ రైస్ మంచిదా? నేనూ సీఎం అభ్యర్థినే.. మనసులోని మాట చెప్పేసిన మధుయాష్కి.. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి