ఉల్లిపాయల వ్యాపారుల ధర్నా..ఉల్లి ధరలు భారీగా పెరగనున్నాయా?

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లి రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉల్లిపాయల వ్యాపారుల ధర్నా..ఉల్లి ధరలు భారీగా పెరగనున్నాయా?
New Update

నిన్న మొన్నటి వరకు టమాటాల ధరలు చుక్కల్లో ఉంటే..ఇప్పుడు వాటి స్థానంలోకి ఇప్పుడు ఉల్లిపాయ వచ్చి చేరేట్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లి రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వ్యాపారులు, రైతులు ధర్నా చేపట్టారు. కేంద్రం తమ దారికి వచ్చేంత వరకు ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. దీంతో ఉల్లిపాయల లావాదేవీలకు బ్రేక్‌ పడింది. భారతదేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ అయిన నాసిక్‌ మార్కెట్ ప్రస్తుత పరిస్థితి ఇదీ. వ్యాపారుల ధర్నాలు కొనసాగితే ఉల్లి ధరలు అమాంతం పెరగడంలో పాటు..ఉల్లి రైతులు నష్టపోయే ప్రమాదం కూడా ఉందని అధికారులు తెలిపారు.

ఉల్లిపాయ ఎగుమతులపై సుంకాన్ని 40 శాతం పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన జరుపుతున్నట్లు నాసిక్‌ డిస్ట్రిక్ట్‌ ఆనియన్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.కేంద్రం నిర్ణయం వల్ల అటు ఉల్లి ఎగుమతి దారులే కాకుండా రైతులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారని అందుకే దీనిని ఉపసంహరించుకునే వరకు జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీలలో వేలాన్ని నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

కానీ ఆందోళన చేసే వ్యాపారులు వెంటనే ధర్నా విరమించుకోవాలని..లేకపోతే వారి మీద తగిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్‌ హెచ్చరించారు. వ్యాపారులు ఇలా చేయడం వల్ల నష్టపోయేది వ్యాపారులు, రైతులే అని ఆయన హెచ్చరించారు. నిబంధనలకు విరుద్దంగా ఆందోళనకు దిగుతున్న వ్యాపారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని నాసిక్‌ కలెక్టర్ ని ఆదేశించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఉల్లి ఎగుమతుల పై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. రవాణాలో ఉన్న ఉల్లిపాయలు రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు.

#onions #nasik-market
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe