Maha Politics: అజిత్‌ పవార్‌ని చూస్తే షాహిద్ అఫ్రిదిని చూసినట్టుంది..ఇద్దరికి ఇద్దరే బాబోయ్..!

మహారాష్ట్రలో ఎన్సీపీ సమాప్తం అంటూ కొద్ది రోజుల కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యనించిన తర్వాత అక్కడ రాజకీయంగా పెద్ద కుదుపు చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)లో ఇది వరకే పలు పర్యాయాలు తిరుగుబాటు బావుటా ఎగరేసి బీజేపీ పంచన చేరిన సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ మరోమారు కాషాయ గూటికి చేరారు. సీఎం ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వ ప్రభుత్వంలో రెండో ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ ప్రమాణస్వీకారం చేశారు.

New Update
Maha Politics: అజిత్‌ పవార్‌ని చూస్తే షాహిద్ అఫ్రిదిని చూసినట్టుంది..ఇద్దరికి ఇద్దరే బాబోయ్..!

ఎన్నిసార్లు డిప్యూటీ సీఎం అవుతావురా బాబు..! ఇప్పుడు దేశనాట ఎవరీ నోట విన్న ఇదే మాట..! మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్‌ పవార్‌ని మించిన అవకాశవాది లేరు. నాలుగేళ్లలో ఏకంగా మూడుసార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ట్రాక్‌ రికార్డు అజిత్‌ పవార్‌ది. డిప్యూటీ సీఎం అవ్వడమే జీవిత లక్ష్యమన్నట్టు ఉంటుంది ఆయన వైఖరీ. తాజాగా మరోసారి అదే ప్రూవ్‌ అయ్యింది. ఐదేళ్లు ప్రతిపక్షంలో కుర్చోలేక పార్టీలను చీల్చే పని పెట్టుకున్న బీజేపీ.. గతేడాది శివసేనని చీల్చితే..ఇప్పుడు ఏకంగా ఎన్సీపీ(NCP)ని చీల్చడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బాబాయ్‌ శరద్‌పవార్‌కి షాక్‌ ఇస్తూ అబ్బాయి అజిత్‌పవార్‌ని పావుగా వాడుకుంది బీజేపీ. ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని ఎరగా వేసి ఎన్సీపీని చీల్చింది. ఇలా అజిత్‌పవార్‌ని తమ రాజకీయ అస్త్రంగా వాడుకోవడం బీజేపీకి నాలుగేళ్లలో ఇది రెండోసారి. అటు నిలకాడలేని రాజకీయ నాయకుడిగా అజిత్‌పవార్‌ క్రికెట్‌లో పాకిస్థాన్‌ లెజెండ్ షాఫిద్‌ అఫ్రిదిని తలపిస్తున్నారు.

అజిత్‌ పవార్‌= షాహిద్‌ అఫ్రిది..:
పాక్‌ లెజండరీ ఆల్‌రౌండర్‌ షాహిత్‌ అఫ్రిది గుర్తున్నాడు కదా..? మర్చిపోయే ప్లేయర్‌ అయితే కాదు లే! బుమ్‌ బుమ్‌ అని గ్యాలరీలో ప్రేక్షకులు నినాదాలు చేస్తే..స్లోగా బ్యాటింగ్‌ చేయాల్సిన చోట కూడా భారీ షాట్‌కి యత్నించి అవుట్‌ అయ్యే తోపు అఫ్రిది. ఇలా తన బ్యాటింగ్‌ పట్ల తనకు ఏ మాత్రం నియంత్రణ లేని అఫ్రిదిని అజిత్‌ పవార్‌తో పోల్చి చూడవచ్చు..! ఎందుకంటే అజిత్‌పవార్‌ కూడా ఆలోచన లేకుండా రెచ్చిపోయే పొలిటిషియన్‌. నీకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని నలుగురు బీజేపీ నాయకులు మైక్‌ ముందు చెప్పగానే ఎమోషనల్‌గా ఫీల్ ఐపోయి బీజేపీ గూటికి చేరడం ఆయనకే చెల్లింది. ఇలా అజిత్‌పవార్‌ బీజేపీ గూటికి చేరడం రెండోసారి.

publive-image షాహిద్ అఫ్రిది, అజిత్‌ పవార్‌(ఫైల్)

2019లో తొలిసారి:
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు హై వోల్టెజ్‌ క్రికెట్‌ ఫైట్‌ని తలపించాయి. కూటమిగా పోటి చేసిన శివసేన-బీజేపీ ఫలితాల తర్వాత విడిపోయాయి. సీఎం కుర్చి విషయంలో మొదలైన వివాదం దశబ్దాల స్నేహనికి తెరపడేలా చేసింది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌, ఎన్సీపీతో జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన సమయంలో ఊహించని విధంగా సీఎంగా ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌పవార్‌ ప్రమాణస్వీకారం చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో అది మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. తర్వాత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంలోనూ అజిత్‌పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలోనూ ఆ బాధ్యతలు స్వీకరించారు. 2019కి ముందు మరో రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు అజిత్‌ పవార్‌. అంటే ఆయన రాజకీయ జీవితంలో ఏకంగా ఐదుసార్లు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు అజిత్‌. ఇది ఆయన ట్రాక్‌ రికార్డు కాదు.. మహారాష్ట్ర ఆల్‌టైమ్‌ రికార్డు..!

అఫ్రిదిలాగే యూటర్న్‌లు:
క్రికెట్‌లో అఫ్రిది ఎన్నీసార్లు రిటైర్‌మెంట్ ప్రకటించాడో తెలుసా..? ఐదు సార్లు..! అవును..మీరు విన్నది నిజమే..! అదేంటి రిటైర్‌మెంట్ ఒక్కసారే ఇస్తారు కదా అని ఆలోచిస్తున్నారా..? అది మిగిలిన ఆటగాళ్ల సంగతి. అఫ్రిది రూటే సపరేటూ. మాట మార్చడంలో అతను దిట్ట.. యూ టర్న్‌ తీసుకోవడంతో ఎక్స్‌పర్ట్‌.. అచ్చం అజిత్‌పవార్‌లానే! ఎందుకుంటే అజిత్‌ కూడా ఏడాదికో పార్టీకి పని చేస్తున్నారు. పూటకోసారి మాట మారుస్తున్నారు. 2019లో ఫడ్నవీస్‌కి మద్దతు ఇచ్చి తర్వాత మళ్లీ ఎన్సీపీలోకి వచ్చిన అజిత్.. ఆ తర్వాత ఉద్ధవ్‌ఠాక్రేకి సపోర్టు ఇచ్చారు.. తర్వాత ఏక్‌నాథ్‌ షిండేకి మద్దతిచ్చారు. ఇప్పుడు మళ్లీ ఫడ్నవీస్‌ చెంతకు చేరారు. ఇది అసలుసిసలైన యూ టర్న్‌ అంటే. ఇప్పుడు ఫడ్నవీస్‌వైపే ఆయన ఉండిపోతారనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే..! డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ఎవరూ చెప్పిన చాలు అక్కడ వాలిపోతుంటారు అజిత్.. అందులోనూ ఆయనపై ఈడీ కేసులు ఉన్నాయట..! అందుకే మరోసారి బీజేపీ గూటికి చేరారని టాక్‌! రేపోమాపో ఆ కేసులన్ని ముంబై బీచ్‌లో కలిసిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు