ఈ రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సం... విదర్భలో 19 మంది మృతి..!!

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఆదివారం (జూలై 23) ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అకోలాలో 107.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భలోని అమరావతి డివిజన్‌పై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రం పూర్తిగా సిద్ధంగా ఉందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అటు గుజరాత్ కూడా భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పంజాబ్ లో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది.

ఈ  రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సం... విదర్భలో 19 మంది మృతి..!!
New Update

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత 10 రోజుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో, 4,500 పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 54,000 హెక్టార్లలో పంటలు కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు గుజరాత్ కూడా వరదలతో అల్లాడిపోతోంది. ఆదివారం (జూలై 23) ఉదయం 241 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో జునాగఢ్ అన్ని చోట్లా జలమయమైంది. 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే నుంచి పార్కింగ్ వరకు ఎక్కడ చూసినా నీరే కనిపించింది.

Maharashtra-Gujarat Destruction

జలదిగ్భందంలో విదర్భ:
ఆదివారం (జూలై 23) ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో అకోలాలో 107.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భలోని అమరావతి డివిజన్‌పై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రం పూర్తిగా సిద్ధంగా ఉందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. జులై 13 నుంచి గడ్చిరోలి, భండారా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, వార్ధా, గోండియాలో ఇద్దరు, చంద్రపూర్‌లో ఒకరు చొప్పున వర్షాల కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో, యవత్మాల్‌లో ముగ్గురు, అకోలా, బుల్దానాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి అనిల్ పాటిల్ ఆదివారం (జూలై 23) యావత్మాల్‌లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

జునాగడ్ ఎయిర్ పోర్టులోకి వరద:

గుజరాత్ లోని జునాగడ్ జిల్లాలో, కుండపోత వర్షం జిల్లాను వరదలు ముంచెత్తడంతో సుమారు 3,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జూలై 24న "భారీ నుండి అతి భారీ వర్షాలు" కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎయిర్ పోర్టు సముద్రాన్ని తలపించింది. రోడ్లపై మొసలులు, ఎల్ పిజీ సిలిండర్లు ఆట వస్తువుల వలే తేలాయి.


57 మంది అదృశ్యం:
రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడి వద్ద బుధవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో రెస్క్యూ కార్యకలాపాలు నిలిపివేశారు. మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తప్పిపోయిన వారి బంధువులు కూడా వారు శిథిలాల కింద మరణించి ఉంటారని నమ్ముతున్నారని తెలిపారు. రెస్క్యూ కార్యకలాపాలను నిలిపివేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారని వెల్లడించారు. కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించినట్లు మంత్రి తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో సహా 1100 మందికి పైగా ప్రజలు నాలుగు రోజులుగా రెస్క్యూ, రిలీఫ్ పనిలో నిమగ్నమై ఉన్నారని సమంత్ చెప్పారు.

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై విరిగిపడిన కొండచరియలు:


ఆదివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ముంబై వైపు వెళ్లే ట్రాఫిక్ స్తంభించింది. ఈ మేరకు ఓ పోలీసు అధికారి సమాచారం అందించారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఎవరూ గాయపడలేదని తెలిపారు. మూడు లేన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.

పంజాబ్ లో వరద బీభత్సం:
భారీ వర్షాల కారణంగా ఘగ్గర్, సట్లెజ్ ఉప్పొంగుతున్నాయి. గగ్గర్ నీరు పాటియాలా గ్రామాల్లోకి ప్రవేశించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భాగ్‌పూర్‌, దద్వా గ్రామాల్లో పంటలు నీట మునిగింది. మరోవైపు ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని హరివాల్ గ్రామంలో సట్లెజ్‌పై నిర్మించిన ధుస్సీ డ్యామ్ తెగిపోవడంతో పొలాలు ముంపునకు గురయ్యాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe