Chandrashekar: మాట వినని జర్నలిస్టులను 'టీ' కి పిలవండి.. వైరల్ గా మారిన బీజేపీ స్టేట్ చీఫ్ కామెంట్స్

జర్నలిస్టులను టీ తాగడానికి తీసుకెళ్లండి.. అంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్‌ బవాన్‌కులే చేసిన కామెంట్స్‌ హాట్ టాపిక్‌ గా మారాయి. అహ్మద్‌నగర్‌లో బీజేపీ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వార్తలు రచించే జర్నలిస్టుల లిస్ట్ ను రెడీ చేయండీ వారిని టీ పార్టీకు పిలుద్దాం అంటూ సెటైర్‌ వేసిన ఓ ఆడియో క్లిప్‌ వైరల్ అవుతోంది.

New Update
Chandrashekar: మాట వినని జర్నలిస్టులను 'టీ' కి పిలవండి.. వైరల్ గా మారిన బీజేపీ స్టేట్ చీఫ్ కామెంట్స్

Chandrashekar: జర్నలిస్టులను టీ తాగడానికి తీసుకెళ్లండి.. అంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్‌ బవాన్‌కులే చేసిన కామెంట్స్‌ హాట్ టాపిక్‌ గా మారాయి. అహ్మద్‌నగర్‌లో బీజేపీ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వార్తలు రచించే జర్నలిస్టుల లిస్ట్ ను రెడీ చేయండి వారిని టీ పార్టీకు పిలుద్దాం.. అంటూ ఆయన వాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

‘ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. జర్నలిస్టులు మనకు వ్యతిరేకంగా వార్తలు రాయకుండా చూసుకోవాలి. టీ తాగడానికి వారిని ఆహ్వానించి దాబాలకు తీసుకెళ్లండి. మర్యాదలు చేయండి. ఎలాంటి టీ గురించి చెప్పానో మీకు అర్థమయ్యిందనుకుంటా’ అని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవాంకులే సూచించినట్టు ఉన్న ఓ ఆడియో క్లిప్‌ వైరల్ అవుతోంది. పార్టీ గురించి వ్యతిరేక వార్తలు రాయకుండా జర్నలిస్టులను మచ్చిక చేసుకోవాలంటూ పార్టీ కార్యకర్తలకు ఇన్ డైరెక్ట్ గా ఐడీయా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఆడియో వైరల్‌ కావడంతో ప్రతిపక్షాలు సీరియస్ గా స్పందిస్తున్నాయి. ‘జర్నలిస్టులందరూ అమ్ముడుపోరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి’ అంటూ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రీంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతిపక్షంగా పనిచేస్తాయని.. కానీ మీడియాను ఎలా గుపిట్లో పెట్టుకోవాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాఠాలు చెబుతున్నారని మండిపడితున్నారు. జర్నలిస్టులను సజావుగా పనిచేయనివ్వకపోవడం బీజేపీ విధానమని.. BJP ప్రజాస్వామ్యాన్ని అంగీకరించదని విమర్శనాస్త్రాలు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు