Mahabubabad: ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక..!!

ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇనుగుర్తి బాలిక‌ల‌ సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తోంది స్వరూప అనే మహిళ. ప్రిన్సిపాల్ వేధింపులకు పాల్పడుతుండడంతో మనస్తాపానికి గురై స్వరూప ఆత్మహత్య యత్నానానికి పాల్పడింది.

New Update
Mahabubabad: ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక..!!

దీంతో స్వరూప పరిస్థితి విషమించడంతో పాఠశాల  ప్రిన్సిపాల్ సిబ్బంది స్వరూపను గుట్టు చప్పుడు కాకుండా హుటాహుటిన తొర్రూరు పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. అయితే, ఈ  విషయం బయటకు చెప్పవద్దంటూ ఆమెను భయబ్రాంతులకు గురిచేసిందని బాధితురాలు వాపోతోంది.  అటెండర్ ను వేధింపులకు గురి చేసి ఆత్మహత్య యత్నానికి ప్రేరిపించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని బాధితురాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : కశ్మీర్‌లో బాంబుల మోత.. ఎలా మోగుతుందో అంటే..?

Advertisment
తాజా కథనాలు