Maha Shivaratri : అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం.. ఇక్కడికి వెళ్తే ఏడు జన్మల పుణ్యం..!

దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో దక్షిణ కాశీ ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ ఆలయ విశిష్టతను తెలుసుకోవడానికి ఆర్టికల్‌ పై క్లిక్ చేయండి.

Maha Shivaratri : అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం.. ఇక్కడికి వెళ్తే ఏడు జన్మల పుణ్యం..!
New Update

Maha Shivaratri 2024 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) కోనసీమ జిల్లాలో దక్షిణ కాశి ద్రాక్షారామంగా ఓ ఆలయానికి గొప్ప పేరు ఉంది. శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో శక్తివంతమైనదిగా భక్తులు చెబుతుంటారు.ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా పేరు పొందింది. 14 అడుగుల స్వయంభు ఆత్మలింగం ఇక్కడ కొలువై ఉంది. ఇది 12వ శక్తిపీఠం కూడా. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7-8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది.

Also Read : తిరుమలలో జాన్వీ కపూర్‌.. ఆమె వెంట ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా!

ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి(Sri Bheemeswara Swamy) స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం ఉంది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠంగా ఈ ఆలయం విరాజిల్లుతుంది. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రసిద్ది చెందింది. భీమేశ్వర మందిర ఉత్తర భాగము లోపలివైపు భీమేశ్వరస్వామి గర్భాలయ ద్వారము ఉంటుంది. స్వామి పాదభాగము తూర్పు ముఖ ధ్వారం వైపు ఉంటుంది.

Also Read : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నమ్మితే అంతే..!

ఈ ఆలయాన్ని సామర్లకోట(Samarlakota) లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజు భీముడు నిర్మించాడని చెబుతారు. ఈ రెండు ఆలయాలు ఒకేలా ఉండటమే కాకుండా రెండు నిర్మాణాలకి ఉపయోగించిన రాయి ఒకటే రకంగా ఉంటుందని అంటారు. ఇదిలా ఉండగా, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి(Maha Shivaratri). ఈ పండుగ కోసం శివభక్తులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘ మాసం కృష్ణ పక్షం చతుర్దశి నాడు శివరాత్రి పండుగను జరుపుకుంటారు. రేపు(మార్చి 8) శివరాత్రి కావడంతో ఇప్పటికే అన్ని శివాలయాలను బాగా అలకరించారు. వేలాది మంది భక్తులు ఆలయాలకు వెళ్లి తమ భక్తిని చాటుకుంటారు.

#dr-br-ambedkar #maha-shivaratri-2024 #samarlakota
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe