మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు.. భార్య ప్రసూతి సమయంలో భర్త పక్కన ఉండాల్సిందే

మద్రాస్ హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. భార్య ప్రసూతి సమయంలో భర్తకు సెలవు మంజూరు చేయాల్సిందేనని మధురై ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరీ నేతృత్వంలోని ధర్మాససం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు.. భార్య ప్రసూతి సమయంలో భర్త పక్కన ఉండాల్సిందే
New Update

భార్య పక్కన ఉండటమే భర్త ధ్యేయం..

గర్భంతో ఉన్న భార్య ప్రసూతి సమయంలో భర్త ఆమె పక్కనే ఉండాలనుకుంటారు. తమ ఇద్దరి దాంపత్య జీవితానికి గుర్తుకు పుట్టే పండంటి పిల్లల బాగోగులు చూసేందుకు భార్యగా ఉండాలని భావిస్తారు. పిల్లలు పుట్టిన రోజు నుంచి మూడు, నాలుగు నెలలు వచ్చే వరకు భార్యకు చేదోడు వాదోడుగా ఉండటానికి పరితపిస్తుంటారు. ప్రస్తుత బిజీబిజీ జీవితంలో పెద్దల తోడు లేకుండా ఎవరికి వారు వేరు కాపురం పెడుతున్నారు. దీంతో పిల్లల్ని కని పెంచడం భార్యాభర్తలకు పెద్ద బాధ్యతగా మారిపోయింది. ఉద్యోగం చేయడంతో పాటు గర్భంతో ఉన్న భార్య యోగక్షేమాలు చూసుకోవడం భర్తకు కష్టంగా మారిపోతుంది. అందుకే భార్యకు ఇచ్చినట్లే భర్తకు కూడా ప్రసూతి సమయంలో సెలవులు ఇవ్వాలనే అభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి.

పెటర్నిటీ సెలవులు ఇవ్వాల్సిందే.. 

ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన తెన్‌కాశీ జిల్లా కడైయం పోలీస్ ఇన్‌స్పెక్టర్ శరవణ్ తన భార్య ప్రసూతి సమయంలో 90 రోజులు సెలవులు కావాలంటూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే తొలుత సెలవులు మంజూరు చేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత మెమో జారీ చేశారు. దీనిపై ఆయన మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్. విక్టోరియా గౌరీ నేతృత్వంలోని ధర్మాసనం ప్రసూతి సమయంలో భార్య బాగోగులను చూసుకోవాల్సిన అవసరం భర్తకు ఉందని అభిప్రాయపడింది. అందుకే ఆయన సెలవు దరఖాస్తును పరిశీలించి సెలవులు మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌దారుడు బాధ్యతాయుతమైన భర్తగా వ్యవహరించారని కాబట్టి ఆయనకు ఇచ్చిన మెమోను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఇక నుంచి ఈ ఆదేశాలు తమిళనాడులోని ప్రతి ఉద్యోగికి వర్తించనున్నాయి.

జస్టిస్ విక్టోరియా గౌరి కీలక వ్యాఖ్యలు..

విచారణ సందర్భంగా జస్టిస్ విక్టోరియా గౌరి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో భర్తలకు ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. పిల్లలను కని, పెంచడంలో భార్యాభర్తలు ఇద్దరికి సమాన బాధ్యత ఉంటుందని తెలిపారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్(1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో భర్త సెలవులు పెట్టే వెసులుబాటు ఉందని.. కానీ చాలా రాష్ట్రాల్లో ఈ రూల్ అమలు కావడం లేదని వెల్లడించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe