Ooty, Kodaikanal: ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తున్నారా..అయితే ఈ పాస్‌ తప్పనిసరి!

Ooty, Kodaikanal: ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తున్నారా..అయితే ఈ పాస్‌ తప్పనిసరి!
New Update

Ooty-Kodaikanal: వేసవి విడిది కోసం ఊటీ, కొడైకెనాల్ లో సేద తీరాలనుకునే పర్యాటకులకు మంగళవారం నుంచి తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్‌ తప్పనిసరి చేసింది. మే 7 నుంచి జూన్ 30 వరకు నీలగిరి, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులను తీసుకెళ్లే వాహనాలను అనుమతించడానికి ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మద్రాసు హైకోర్టు ఆదేశాలతో మే 7 మంగళవారం నుంచి ఊటీ , కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులకు రిజిస్ట్రేషన్, ‎ఈపాస్‌ కలిగి ఉండాల్సి ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్‌ పర్యటనతో పాటు అక్కడ బస చేయడానికి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. పర్యాటకులు తమ వివరాలు, వెహికల్‌ నంబరు, ఊటీ, కొడైకెనాల్ ఎప్పుడు వచ్చేది, ఎన్నిరోజులు ఉంటారు వంటి వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది.

ఊటీలో పర్యటించాలనుకునే పర్యాటకులు, వ్యాపారులు, తమ వివరాలను www.epass.tnega.org వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పాస్‌ ద్వారా పర్యాటకుల రద్దీని క్రమబద్ధీకరించ వచ్చని భావిస్తున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఈ పాస్‌ విధానం జూన్ 30వరకు మాత్రమే అమలు కానుంది.

ఈ ఈ-పాస్ లో క్యూఆర్ కోడ్ ఉండడంతో దానిని చెక్ పోస్టులలో సిబ్బంది స్కాన్ చేస్తారని కలెక్టర్ ఎం.అరుణ తెలిపారు. తమిళనాడు ఈ-గవర్నెన్స్ ఏజెన్సీ (టీఎన్ఈజీఏ)తో కలిసి తాము ఒక సాఫ్ట్ వేర్‌ రూపొందించామని, ఇందులో ప్రజలు దరఖాస్తు చేసుకుని ఊటీలోకి ప్రవేశించవచ్చని ఊటీ జిల్లా కలెక్టర్ ఎం.అరుణ తెలిపారు.

పర్యాటకులు చేయాల్సిందల్లా పేరు, చిరునామా, ఊటీలో ఎన్ని రోజులు ఉండబోతున్నారు, ఉండబోయే ప్రదేశం, అందుబాటులో ఉన్న వాహనం పేరు, కొన్ని ప్రాథమిక వివరాలను ఇవ్వాలి ". ఆ తర్వాత ఈ-పాస్ జనరేట్ అవుతుంది. హనాల సంఖ్య, పర్యాటకుల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు లేవని స్థానికులకు సంబంధించి ఈ-పాస్ ల నుంచి మినహాయింపు ఇచ్చినట్టు కలెక్టర్ తెలిపారు.

Also read: జనం కోసం పుట్టిన జనసేనాని నా తమ్ముడు.. పవన్ కోసం చిరంజీవి సంచలన వీడియో

#tamilanadu #govt #ooty #kodaikenal #e-pass
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe