రూ.5000.. నమిలి మింగేశాడు!! మధ్యప్రదేశ్‌లోని కట్నిలోని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం కింద రూ.5000 డిమాండ్ చేశాడు. దాంతో సదరు వ్యక్తి లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బృందానికి సమాచారం అందించాడు. By Bhavana 25 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి మధ్య ప్రదేశ్‌లో రెవెన్యూ అధికారి తాను లంచంగా తీసుకున్న డబ్బును మింగేశాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని కట్నిలోని రెవెన్యూ విభాగానికి చెందిన ఓ అధికారి ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం కింద రూ.5000 డిమాండ్ చేశాడు. దాంతో సదరు వ్యక్తి లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బృందానికి సమాచారం అందించాడు. పథకం ప్రకారం అధికారులు నిఘా పెట్టి పథకం ప్రకారం..అధికారిని పట్టుకున్నారు. లోకాయుక్త పోలీసులను చూసిన సదరు రెవెన్యూ అధికారి పట్వారీ గజేంద్ర సింగ్ లంచంగా తీసుకున్న నగదు మొత్తాన్ని నమిలి మింగేశాడు. దీంతో అధికారులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన గురించి ఎస్పీఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ సాహు మాట్లాడుతూ..'' గజేంద్ర సింగ్ లంచం అడిగినట్లు బర్ఖేడా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మాకు ఫిర్యాదు చేసాడు. అందుకే అతని మీద మా బృంద సభ్యులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో అతను తన ప్రైవేటు కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. కానీ అతను మమ్మల్ని చూసి ఆ డబ్బు మొత్తాన్ని నమిలి మింగేశాడు. దాంతో వెంటనే మేము ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి