Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం..అర్ధనగ్నంగా తీవ్ర రక్తస్రావంతో చిన్నారి నరకయాతన..!!

సమాజంలో చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా,12 ఏళ్ల బాలిక అర్ధనగ్న స్థితిలో, తీవ్ర రక్తస్రావం అవుతున్న పరిస్థితులో సాయం కోరింది. కనిపించిన ప్రతి వ్యక్తిని సహాయం కోరింది. ప్రదర్శన చూసినట్టు చూశారే తప్ప సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో చోటుచేసుకుంది.

New Update
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం..అర్ధనగ్నంగా తీవ్ర రక్తస్రావంతో చిన్నారి నరకయాతన..!!

Madhya Pradesh: సమాజంలో చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా,12 ఏళ్ల బాలిక అర్ధనగ్న స్థితిలో, తీవ్ర రక్తస్రావం అవుతున్న పరిస్థితులో సాయం కోరింది. కనిపించిన  ప్రతి వ్యక్తిని సహాయం చేయమని కోరింది. కానీ,  ప్రదర్శన చూసినట్టు చూశారే తప్ప సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 

ఓ వ్యక్తి అయితే ఆ బాలిక ఉన్న పరిస్ధితి చూసి సానూభూతి చూపాల్సింది పోయి తరిమి కొట్టాడు. ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చివరికి ఓ ఆశ్రమం ఆమెను చేరదీసింది. బాలికకు టవల్ ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బాద్ నగర్ లో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఆమెను తొలుత జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు సీరియస్ గాయాలు అయినట్టు, అత్యాచారం జరిగినట్టు డాక్టర్స్ నిర్ధారించారు. తనకు బ్లెడ్ కావాల్సి ఉండడంతో ఇండోర్ కు తరలించారు.

ప్రస్తుతం ఆ బాలిక షాక్ లో ఉంది. పోలీసులు ఆ బాలికతో మాట్లాడే ప్రయత్నం చేసారు. అనుమానుం ఉన్న ఓ వ్యక్తి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ఉజ్జయిని పోలీస్ చీఫ్ సచిన్ శర్మ తెలిపారు. బాలిక ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు చెందిన వ్యక్తి కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా అన్న తేడా లేదు.. ఆడపిల్ల అయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా మీదపడిపోతున్నారు. ఆడపిల్ల తల్లిదండ్రలు పిల్లలను కనీసం స్కూల్ కు పంపాలన్న  భయపడే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. ఎంత కఠినంగా శిక్షించినా.. కీచకుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఆ బాలికకు అంత దీన పరిస్ధితి ఎందుకు వచ్చింది. ఈలాంటి కేసులు రోజు ఎన్నో వెలుగులోకి వస్తున్న ప్రభుత్వాలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాయి. నిందితులకు సరైన శిక్ష విధించకపోవడం వల్లే ఈలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఏపీలో మరో దారుణం.. పదేళ్ల చిన్నారి కిడ్నాప్ మర్డర్..అసలేమైందంటే?

Advertisment
తాజా కథనాలు