MP excreta: వీళ్లు మారరా..? మధ్యప్రదేశ్‌లో మరో ఘోరం..ఈ సారి దళితుడిపై మానవ విసర్జన

దేశం ఎటు వెళ్తోంది..? భారత్‌కు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతోంది. దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో నాదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటారు. ప్రపంచంలో అణ్వాయుధ వ్యవస్థ అధికంగా ఉన్నదేశాల్లో ఇండియా టాప్‌ 10లో ఉందని ధైర్యంగా మాట్లాడుతారు. జనాభా పరంగా ప్రపంచంలో పెద్ద దేశమని చెప్పుకుంటారు. భారత్‌లో పెట్టుబడులు ఉపందుకున్నాయని, దేశ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటారు. కానీ దేశంలో జరిగే అకృత్యాల గురించి పట్టించుకోరు.

MP excreta: వీళ్లు మారరా..? మధ్యప్రదేశ్‌లో మరో ఘోరం..ఈ సారి దళితుడిపై మానవ విసర్జన
New Update

Madhya Pradesh - Atrocious Incident - Dalit - Human Excreta

దేశం ఎటు వెళ్తోంది..? భారత్‌కు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతోంది. దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో నాదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటారు. ప్రపంచంలో అణ్వాయుధ వ్యవస్థ అధికంగా ఉన్నదేశాల్లో ఇండియా టాప్‌ 10లో ఉందని ధైర్యంగా మాట్లాడుతారు. జనాభా పరంగా ప్రపంచంలో పెద్ద దేశమని చెప్పుకుంటారు. భారత్‌లో పెట్టుబడులు ఉపందుకున్నాయని, దేశ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటారు. కానీ దేశంలో జరిగే అకృత్యాల గురించి పట్టించుకోరు.

మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో జరిగిన ఘటన మరవకముందే.. తాజాగా అదే రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఛతర్‌పూర్‌లో దళిత వర్గానిక చెందిన వ్యక్తి గ్రీజు డబ్బాను తాకాడని మరో కులానికి చెందిన వ్యక్తి అతనిపై మానవ విసర్జనకు పాల్పడ్డాడు. దళితుని శరీర భాగాలపైనే కాకుండా.. అతని ముఖంపై కూడా విసర్జన చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం తారా స్థాయికి చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే.. (జూలై 21) శుక్రవారం రోజు ఛతర్‌పూర్ జిల్లాలో దళిత వర్గానికి చెందిన దశరథ్ అహిర్వార్.. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన రామ్‌కృపాల్ పటేల్‌కు సంబంధించిన గ్రీజు డబ్బాను పొరపాటున తాకాడు. దీంతో దళిత వ్యక్తి తన గ్రీజు డబ్బాను తాకాడని అగ్రహం వ్యక్తం చేసిన రామ్‌కృపాల్ పటేల్‌.. దళితున్ని చితకబాది తర్వాత అతడిపై విసర్జన చేశాడు.

కానీ బాధితుడు దశరథ్ అహిర్వార్ జూలై 21న పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో నిందితుడిపై పోలీసులు ఎలాంటి యాక్షన్‌ తీసుకోలేదు. గ్రామ పంచాయతీ నిర్ణయం తర్వాత మర్నాడు (జూలై 22) శనివారం బాధితుడు దశరథ్ అహిర్వార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దళితుడిపై విసర్జన చేసిన రామ్‌కృపాల్ పటేల్‌పై ఐపీసీ (IPC) సెక్షన్‌తోపాటు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టంలోని సెక్షన్‌ 294 ప్రకారం అశ్లీల చర్యలు, 506 సెక్షన్ ప్రకారం నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. బాధితుడు ఛతర్‌పూర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని బికౌరా గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఇంకా కులాల మధ్య, వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. అంటరాని కులానికి చెందిన వారని తమను ఏమీ చేయలేరని దళితులపై విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. మణిపూర్‌లో వర్గాల మధ్య చెలరేగిన చిచ్చు అల్లర్లకు దారి తీయగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతే కాకుండా ఇటీవల దళిత వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై క్రూరంగా ప్రవర్తించిన యువకులు వారిని నగ్నంగా నడిపించారు. ఇది దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ పాలనకు పరాకాష్ట్ర అని విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ పాలనలో మహిళలకు భద్రతలేకుండా పోతోందని పలు ప్రార్టీలకు చెందిన మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లో దళితుడిపై అమానవీయ ఘటన జరగడం బీజేపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

#madhya-pradesh #atrocious-incident #human-excreta
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe