Vishal: ఆ సంస్ధకు అప్పు చెల్లించని హీరో విశాల్..!!

నటుడు విశాల్‌పై లైకా సంస్థ వేసిన కేసులో మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. హీరో విశాల్ దాదాపు రూ.23 కోట్ల వరకు లైకా నిర్మాణ సంస్థకు అప్పు చెల్లించాల్సి వుంది. అయితే, విశాల్ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులున్నప్పటికీ తమకు చెల్లించడం లేదంటూ లైకా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తమకు చెల్లించాల్సిన నగదులో సగమైనా డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించాలని కోరారు. అయితే, ఇందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ అందుకు లైకా సంస్థ చర్చలకు రావడం లేదని విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నవంబరు 1కి విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Vishal: ఆ సంస్ధకు అప్పు చెల్లించని హీరో విశాల్..!!
New Update

Vishal: నటుడు విశాల్‌(Vishal)‌పై లైకా సంస్థ వేసిన కేసులో మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో విచారణ జరిగింది. హీరో విశాల్ దాదాపు రూ.23 కోట్ల వరకు లైకా నిర్మాణ సంస్థకు అప్పు చెల్లించాల్సి వుంది. అయితే, విశాల్ బ్యాంకు అకౌంట్‌లో డబ్బులున్నప్పటికీ తమకు చెల్లించడం లేదంటూ లైకా సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయం కోర్టుకు ఆయన సమర్పించిన బ్యాంకు లావాదేవీలను బట్టి తెలుస్తోందని పేర్కొన్నారు. తమకు చెల్లించాల్సిన నగదులో సగమైనా డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించాలని కోరారు.

విశాల్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. ఈ విషయంలో తమ సమాధానం కోసం కొంత సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయస్థానం.. లైకా సంస్థకు చెల్లించాల్సిన అమౌంట్  ఎందుకు తిరిగి ఇవ్వడం లేదని ప్రశ్నించింది. అయితే, ఇందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ లైకా సంస్థ చర్చలకు రావడం లేదని విశాల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నవంబరు 1కి విచారణను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

publive-image

ఇటీవలే మార్క్ ఆంటోనీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు విశాల్ . పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మార్క్ ఆంటోనీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విశాల్‌ ప్రస్తుతం మరో సినిమా విశాల్‌ 34 (Vishal 34)‌తో బిజీ అయిపోయాడు. ఈ మూవీ ఏప్రిల్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా షురూ అయింది. విశాల్‌ 34 అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ను ఇప్పటికే లాంఛ్ చేశారు.

Also Read: ఆ హీరో మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్..!!

#hero-vishal #madras-high-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe