Lung Health: వీటిని తాగితే.. మీ ఊపిరితిత్తులకు ఏ బాధ ఉండదు..! కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. కలుషితాల నుంచి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కలిగిన అల్లం టీ, తేనే, లెమన్ టీ, బీట్ రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ తాగాలి. By Archana 10 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Lung Health: ప్రస్తుత సమాజంలో వాతావరణ కాలుష్యం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. వాతావరణ కాలుష్యానికి పలు రకాల కారణాలు ఉన్నాయి.. వాహనాల నుంచి విడుదలయ్యే హానికర వాయువులు, ఇండస్ట్రీస్ నుంచి వెలువడే వ్యర్థాలు, పొగ, అడవుల నిర్మూలన ఇవ్వని పర్యావరణంలో కాలుష్యానికి కారణమవుతున్నాయి. పర్యావరణంలో స్వచ్ఛమైన గాలి దొరకడమే కష్టంగా మారింది. వాతావరణ కాలుష్యం వల్ల.. మనం పీల్చే గాలి కూడా కలుషితం అవుతుంది. దాని వల్ల శ్వాస సమస్యలు, ఊపిరితిత్తుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. కలుషితమైన వాతావరణం నుంచి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ పానీయాలను తాగండి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడే పానీయాలు.. అల్లం టీ: అల్లంలోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. ఇవి గాలి వాహికను శుభ్రంగా ఉంచి .. శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ: గ్రీన్ టీ లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఊపిరితిత్తుల్లోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. మిరియాల టీ: దీనిని తాగడం వల్ల ఊపితిత్తుల కండరాళ్ళు గట్టిగా అవ్వకుండా వాటిని సులువు చేసి శ్వాస సమస్యల నుంచి దూరంగా ఉంచును. తేనే, లెమన్ టీ: ఉదయాన్నే లేవగానే కొంచం గోరు వెచ్చని నీటిలో తేనే, నిమ్మ రసం కలిపి తాగితే జలుబు, గొంతు నొప్పి సమస్యలను తగ్గించడంతో పాటు శ్వాసక్రియ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బీట్ రూట్ జ్యూస్: దీనిలో అధికంగా ఉండే నైట్రేట్స్ ఊపిరితిత్తుల పని తీరు మెరుగు పడేలా చేస్తుంది. అలాగే ఊపిరితిత్తుల కండరాళ్లలో ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త పోటు సమస్యల నుంచి కూడా కాపాడతాయి. క్యారెట్ జ్యూస్: వీటిలో అధికంగా ఉండే విటమిన్ 'సి' యాంటీ ఆక్సిడెంట్స్ ఊపితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. పసుపు: పసుపులో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు హానికరమైన వాయువుల నుంచి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ద్రాక్ష రసం: దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఊపిరి నాళాలలో ఉన్న విషపూరితాలను తొలగించి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. హెర్బల్ టీ: ఆయుర్వేద మొక్కల నుంచి తయారు చేసిన పానీయాలను తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యంతో పాటు శ్వాస సమస్యలు కూడా మెరుగుపడతాయి. Also Read: Chocolate : చాక్లెట్స్ అంటే ఇష్టమా.. అయితే ఇది తప్పక చూడండి..! #lung-health #healthy-drinks-for-lung-health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి