Lunar Eclipse 2024: హోలీ నాడే చంద్రగ్రహణం, ఈ 4 రాశుల వారు జీవితంలో కష్టాల నుంచి బయటపడతారు..!!

New Update
Lunar Eclipse 2024: నేడే చంద్రగ్రహణం..ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం.. ప్రభావం ఎలా ఉంటుంది?

Lunar Eclipse 2024: సూర్యుడు,చంద్రుడు, భూమి వరుసలో ఉన్నప్పుడు గ్రహణాలు సంభవిస్తాయి. ఈ సంవత్సరం 2 చంద్ర గ్రహణాలు, 2 సూర్య గ్రహణాలు ఉంటాయి. మార్చి 25న ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనది.ఎందుకంటే ఈ సమయంలో చంద్రుడు ఛాయా గ్రహం రాహువు కన్యారాశిలో ఉంటాడు. అలాగే, అందరికీ ఇష్టమైన పండుగ హోలీ కూడా ఈ రోజునే వస్తుంది. కాబట్టి దీనిని చాలా ప్రత్యేకమైన కలయిక అని పండితులు చెబుతున్నారు.

చంద్రగ్రహణం (Lunar Eclipse )ఉదయం 10:23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 03:02 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం కారణంగా ప్రధానంగా 4 రాశుల వారి జీవితాల్లో పెను మార్పు వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

ధనస్సు రాశి:
ధనస్సురాశివారికి చంద్రగ్రహణం నుంచి మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు వింటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.

మకర రాశి:
చంద్రగ్రహణంతో మకర రాశి వారికి కష్టాలు తీరుతాయి. ప్రధానంగా ఇప్పుడు ఓ రకమైన కంఫర్ట్ దొరుకుతుందని చెప్పొచ్చు. అలాగే కెరీర్‌లో పురోగతి ఉంటుంది.

సింహరాశి:
మీరు చేసే పనిలో అందరి నుండి మీకు మద్దతు లభిస్తుంది. అలాగే, మీరు కొత్త ప్రణాళికలను తయారు చేసుకుంటారు. జీవితంలో ఐశ్వర్యం, ఆనందం రెట్టింపు అవుతాయి.

మిథునం:
మీరు మాటల వల్ల చాలా ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లయితే ఇంతకంటే మంచి సమయం లేదు.

ఇది కూడా చదవండి: మోదీ సర్కార్ కీలక ప్రకటన…లబ్దిదారులకు రూ. 5లక్షలు. వెంటనే ఈ విధంగా చేయండి..!!

Advertisment
తాజా కథనాలు