Tirumala Darshanam: శ్రీవారి దర్శనానికి లక్కీ డిప్ డేట్స్ వచ్చేశాయి..!

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్, తిరుమల తిరుపతి దేవస్థాన మండలి శ్రీవారి దర్శనానికి లక్కీ డిప్ డేట్స్‌ని ప్రకటించింది. ఏఏ రోజుల్లో ఏఏ టికెట్స్ విడుదల అవుతాయో తెలుసుకోండి.

New Update
Tirumala Darshanam: శ్రీవారి దర్శనానికి లక్కీ డిప్ డేట్స్ వచ్చేశాయి..!

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. జూలై నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్ లైన్ కోటాను ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.ఇక జూలై నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు