Accident: గుడిసెను ఢీకొట్టిన ట్రక్కు..నిండు గర్భిణీతో పాటు కుటుంబం మొత్తం..!

యూపీలో ఘోర ప్రమాదం జరిగింది.శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసె పై బోల్తా పడింది. ఆ సమయంలో గుడిసెలో ఉన్న కుటుంబం మొత్తం బలైపోయింది. ఈ ప్రమాదంలో 8 నెలల గర్భిణీ కూడా మృతి చెందింది.

New Update
Accident: గుడిసెను ఢీకొట్టిన ట్రక్కు..నిండు గర్భిణీతో పాటు కుటుంబం మొత్తం..!

Uttara Pradesh: యూపీలో ఘోర ప్రమాదం జరిగింది. లక్నోలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఓ నిండు గర్భిణీతో పాటు కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసె పై బోల్తా పడింది. ఆ సమయంలో గుడిసెలో ఒక కుటుంబం నిద్రపోతోంది. ప్రమాదంలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన వారిలో నీలమ్ దేవి అనే 8 నెలల నిండు గర్భిణి కూడా ఉంది.

ఈ ప్రమాదంలో నీలం, ఆమెకు పుట్టబోయే బిడ్డ, భర్త ఉమేష్, ఇద్దరు కుమారులు గోలు, సన్నీ కూడా చనిపోయారు. ఈ ప్రమాదంలో 8 నెలల గర్భిణి నీలమ్‌ కడుపు పగిలి పిండం బయటకు వచ్చింది. వీరంతా బారాబంకి జిల్లా వాసులు. మృతుడు ఉమేష్ జీవనోపాధి కోసం మట్టి పాత్రలు తయారు చేయడంతోపాటు టైల్స్ చేసేవాడు. అతనితో పాటు ఆయన భార్య , ఇద్దరు కుమారులు గుడిసెలో ఉంటున్నారు. ఉమేష్ భార్య నీలం గర్భవతి. వచ్చే నెలలో ఆమెకు ప్రసవం కావాల్సి ఉంది.

అయితే అర్థరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో కుటుంబం మొత్తం చనిపోయారు. మొరం లోడ్ చేసిన ట్రక్ అర్థరాత్రి గుడిసె పై బోల్తా పడడంతో నిద్రలోనే అందులో నివసించే వారంతా చనిపోయారు. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఉమేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు.

కానీ అప్పటికి చాలా ఆలస్యమైంది. కుటుంబం మొత్తం చనిపోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో బోల్తా పడిన ట్రక్కుని పైకి లేపి గుడిసెలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి..స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Also read: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

Advertisment
తాజా కథనాలు