Gambhir vs Kohli: గంభీర్‌ పదవి ఊడనుందా..? కోహ్లీతో గొడవనే కారణమా..?

వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కి గంభీర్‌ దూరమయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. లక్నోటీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతనిపై వేటు వేసే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లక్నో మెంటర్‌గా ఉన్న గంభీర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో కోహ్లీతో గొడవపడడాన్ని జట్టు యాజమాన్యం సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

New Update
Gambhir vs Kohli: గంభీర్‌ పదవి ఊడనుందా..? కోహ్లీతో గొడవనే కారణమా..?

ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌ లీగ్‌ హిస్టరీలోనే అత్యంత వివాదాస్పద ఘటనగా నిలిచిపోయింది. టోర్నీ ముగిసి 40రోజులు దాటినా ఇప్పటికీ గంభీర్‌ వర్సెస్ కోహ్లీ ఫైట్‌ని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ ఘటన గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా మరో విషయం గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లక్నో మెంటర్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌పై ఆ జట్టు యాజమాన్యం ఆగ్రహంగా ఉందని.. వచ్చే సీజన్‌ నుంచి అతన్ని జట్టు నుంచి తప్పించనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంతా..?

publive-image గంభీర్ వర్సెస్ కోహ్లీ

అసలేం జరిగిందంటే..?
అప్పటివరకు ప్రశాంతంగా సాగిపోతున్న ఐపీఎల్ 2023 సీజన్‌లో మే2న జరిగిన లక్నో వర్సెస్‌ ఆర్సీబీ మ్యాచ్‌ ఒక్కసారిగా అగ్గి రేగింది. క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఊహించిన మసాలా కూడా యాడ్ అయ్యింది. మ్యాచ్ తర్వాత మినీ రణరంగమే జరడాన్ని కాక రేపింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ 126 పరుగులే చేసినా లక్ష్యఛేదనలో లక్నో 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే నవీన్ వుల్ హక్, అమిత్ మిశ్రా కలిసి కాసేపు వికెట్లకు అడ్డుగా నిలిచి, రెండేసి బౌండరీలు బాదారు. ఈ సమయంలో నవీన్ వుల్ హక్‌‌ని విరాట్ కోహ్లీ సెడ్జ్ చేశాడు. ఆ తర్వాత అతను అవుట్ అవ్వగానే అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దానికి నవీన్ వుల్ హక్ రియాక్ట్ కావడంతో గొడవ మొదలైంది. నవీన్ వుల్‌ హక్‌కి బూటు కాలు చూపిస్తూ కోహ్లీ ప్రవర్తించిన తీరు అతనికి బాగా కోపం తెప్పించింది.


గంభీర్‌ ఇన్‌వల్వ్‌ అవ్వడంతో ముదిరిన వివాదం
గ్రౌండ్‌తో నవీన్‌ వర్సెస్‌ కోహ్లీ ఫైట్ మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. ఇరు జట్టు ఆటగాళ్లు షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చుకునే సమయంలో నవీన్‌, కోహ్లీ మరోసారి గొడవ పడ్డారు. వెంటనే గంభీర్‌ ఎంట్రీ ఇచ్చాడు. మాటామాటా పెరిగింది. 2013లో కూడా ఇలానే ఈ ఇద్దరు గొడవ పడ్డారు. దాదాపు కొట్టుకునే వరకు వెళ్లారు. ఇక ఇదే ఏడాది సీజన్‌ స్టార్టింగ్‌లో జరిగిన ఇరు జట్ల మ్యాచ్‌లో గంభీర్‌ తీరుపై ఆర్సీబీ ఫ్యాన్స్‌ మండిపడ్డారు. ఆ మ్యాచ్‌లో లక్నో గెలవడంతో గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గంభీర్‌.. చిన్నస్వామి స్టేడియం ప్రేక్షకులను కామ్‌గా ఉండమంటూ సైగలు చేశాడు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని కోహ్లీ లక్నోలో జరిగిన మ్యాచ్‌లో అతిగా ప్రవర్తించాడంటారు ఫ్యాన్స్‌.

గంభీర్‌ని తీసేస్తారా..?
నిజానికి లక్నో ఓనర్‌ సంజీవ్ గోయెంకాతో కోహ్లీకి వ్యాపార సంబంధాలున్నాయి. అందుకే కోహ్లీతో గంభీర్‌ గొడవపడడం మేనేజ్‌మెంట్‌కి నచ్చలేదట.. మరోవైపు లక్నోకి ఫ్యాన్‌ బేస్‌ కూడా తక్కువగా ఉందని.. పైగా కోహ్లీతో గొడవ పడడంతో అతని ఫ్యాన్స్‌ లక్నో టీమ్‌కి వ్యతిరేకంగా మారిపోయారని..అందుకే గంభీర్‌ని రిమూవ్‌ చేసేసి విరాట్‌ ఫ్యాన్స్‌ని కూల్‌ చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు.. మరోవైపు గంభీర్‌ కూడా వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో గంభీర్‌ తన ఎంపీ స్థానం నిలుపుకోవడం అతనికి అన్నిటీకంటే ముఖ్యం.. అందుకే గంభీర్‌ సీజన్‌కి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండే ఛాన్స్‌ కనిపిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు