Weather: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన..

బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం నాటికి తీవ్ర వాయుగుండగా మారనుంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందన్నారు.

New Update
Weather: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన..

Andhra Pradesh Rain Alert: అంగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం(Weather Alert) ఏర్పడింది. అండమాన్, నికోబార్ దీవులకు అనుకుని ఈ అల్పపీడనం ఏర్పడిందని, పశ్చిమ వాయుద్య దిశగా కదులుతోందని చెప్పారు వాతావరణ కేంద్రం అధికారులు. ఈ అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారనుందని తెలిపారు. గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు అధికారులు. ఇదిలాఉంటే.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఈ ఆవర్తనం నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో.. రానున్న రెండు రోజులు తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.

అలాగే, బుధవారం, గురువారాల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇక బుధవారం నాడు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందన్నారు. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందన్నారు. ఈ కారణంగా ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ కేంద్రం అధికారులు. వర్షం కురిసే సమయంలో సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. అలాగే, ఈదురు గాలుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

Also Read:

మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ..

తెలంగాణ ఎన్నికల బరిలో యంగ్ లీడర్స్ వీరే..

Advertisment
Advertisment
తాజా కథనాలు