Break Up: ఇది సినిమా కాదు బాసూ.. రియల్‌ లైఫ్‌.. బ్రేక్‌ అప్‌ తర్వాత ఇవి చేయకండి..!

బ్రేక్‌ అప్‌ అవ్వగానే చాలా మంది సెల్ఫ్‌ కేర్‌ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఇక సినిమాల్లో చూపించినట్లు మందు తాగడం లాంటివి చేయవద్దు. లవ్ బ్రేక్ అప్ అవ్వగానే లవర్‌ గురించి చాలా చెడుగా మాట్లాడుతుంటారు. ఇది అసలు కరెక్ట్ కాదు. బ్రేక్ అప్ అయిన తర్వాత ఏం చేయాలి.. ఏం చేయకూడదు లాంటి విషయాలు మరింత తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ను చదవండి.

New Update
Break Up: ఇది సినిమా కాదు బాసూ.. రియల్‌ లైఫ్‌.. బ్రేక్‌ అప్‌ తర్వాత ఇవి చేయకండి..!

బ్రేక్‌ అప్‌ అంటే చిన్న విషయం కాదు.. సినిమాలో చూపించినట్టు జీవితాన్ని నాశనం చేసుకునే పెద్ద విషయమూ కాదు. అది కూడా లైఫ్‌లో కూడా ఒక పార్ట్. బ్రేక్‌ అప్ అవ్వగానే లైఫ్‌ ఎండైపోయినట్టు కాదు. ఈ విషయంలో ఎవరి తప్పు ఉన్నా దాని మళ్లీ రిపీట్ చేయకుండా లైఫ్‌లో ముందుకు వెళ్లాలి. బాధను అధిగమించాలి. ఇది కాస్త కష్టమే కావొచ్చు. అడుగు ముందుకు వెయ్యకపోతే మీ లైఫ్‌ ప్రమాదంలో పడినట్టే లెక్క. ఇక కొంతమంది బ్రేక్ అప్ అవ్వగానే కొన్ని మిస్టెక్స్ చేస్తుంటారు. ఎలా ఉండకూడదో అలా ఉంటుంటారు. దీని వల్ల బ్రేక్ అప్ బాధను బయటకు రాలేకపోతుంటాం. అందుకే బ్రేక్‌ అప్ అయిన వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాం.

తొందర వద్దు: చాలా మంది బ్రేక్‌ అప్ అవ్వగానే మళ్లీ ప్యాచ్‌ అప్ అవుతుంటారు. వేరే పార్టెనర్‌ కోసం వెతుకుతుంటారు. ఇంకో రిలేషన్‌లోకి త్వరగా వెళ్లిపోతుంటారు. ఇలా చేయవద్దు. ముందుగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. బ్రేక్‌ అప్‌ అయిన లవర్‌తో ఉన్న ఏ విషయమైనా మిమ్మల్ని ప్రభావితం చేసేలాగా ఉండకూడదు. ఒకవేళ ఆ ఎఫెక్ట్ ఇంకా ఉండి ఉంటే అది మీ కొత్త లవర్‌పై ప్రభావం చూపుతుంది.

వెంబడించవద్దు:ఇది చాలా మంది చేసే తప్పు. బ్రేక్ అప్ అయిన తర్వాత లవర్‌ ఏం చేస్తుంది అన్నది మనకు అనవసరం. కానీ కొంతమంది అదేపనిగా సోషల్‌మీడియాలో లవర్‌ ఏం చేస్తుందో చూస్తుంటారు. ఇది స్టాకింగ్‌ కిందకు వస్తుంది. అసలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల మీ మైండ్‌ ఖరాబ్‌ అవుతుంది. పాత విషయాలను మరిచిపోనివ్వకుండా చేస్తుంది.

ఎమోషన్స్: మనిషికి భావోద్వేగాలు కచ్చితంగా ఉంటాయి. వాటిని సప్రెస్ చేయకూడదు. ఏడుపు వస్తే ఏడవాలి.. నవ్వు వస్తే నవ్వాలి. బ్రేక్ అప్ అయినప్పుడు బాధ ఉంటుంది. దాని అణిచివేయడానికి చూడవద్దు.

సెల్ఫ్‌ కేర్‌ నిర్లక్ష్యం చేయవద్దు: మీ శారీరక, మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. వ్యాయామం చేయండి, బాగా తినండి, తగినంత నిద్ర పొందండి. చాలా మంది బ్రేక్ అప్ తర్వాత సరిగ్గా తినరు. జరిగిపోయిన దాన్నే తలుచుకుంటూ బాధపడుతుంటారు. ఇలా చేయవద్దు. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

ఒంటరిగా ఉండవద్దు: బ్రేక్ అప్ తర్వాత చాలా మంది తెలియకుండానే ఒంటరిగా గడుపుతుంటారు. దీని వల్ల జరిగిపోయిన ఘటన నుంచి బయటకు రాలేకపోతారు. అందుకే మైండ్‌ డైవర్షన్ అవసరం. మీకు నచ్చిన ఫ్రెండ్స్‌తో టైమ్‌ స్పెండ్‌ చేయండి. అటు కుటుంబసభ్యులతోనూ గడపండి.

జ్ఞాపకాలు: గతాన్ని గురించి ఆలోచించడం మీ ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. అదే పనిగా అప్పుడు అది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, తను ఉంటే బాగుండేది లాంటివి మైండ్‌లో అనుకోవద్దు. ఇతర లవర్స్‌ని చూసి కంపేర్ చేసుకోవద్దు.

బ్యాడ్‌ మౌత్‌: ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. లవ్ బ్రేక్ అప్ అవ్వగానే లవర్‌ గురించి చాలా చెడుగా మాట్లాడుతుంటారు. ఇలా అసలు చేయవద్దు. ఇతరుల దగ్గర మీ విలువ పోతుంది. అంతకాలం ప్రేమలో ఉన్నవాళ్ల మీద బ్రేక్ అప్ అవ్వగానే బ్యాడ్‌గా చెప్పడం వల్ల మీ మీద ఇతరులకు కూడా గౌరవం పోతుంది.

Also Read: 40ల్లో ఉన్నారా… హెవీ వర్కౌట్స్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే.

Advertisment
తాజా కథనాలు