Love in the age of PUBG: సరిహద్దులు దాటిన ప్రేమ..! ప్రేమికుడి కోసం పాకిస్థాన్ నుంచి ఇండియా వచ్చేసిన సీమా.. ప్రేమ కోసం పాకిస్థాన్‌కి చెందిన సీమా ఇండియాకు వచ్చింది. ఆన్‌లైన్ గేమ్ పబ్ జీ ద్వారా పరిచయం అయిన సచిన్ అనే యువకుడిని కలుసుకునేందుకు ఆమె అక్రమంగా సరిహద్దు దాటింది. ప్రస్తుతం సచిన్,సీమా ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. By Trinath 05 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ప్రేమకు హద్దులు ఉండవు.. సరిహద్దులు అంతకన్నా ఉండవు.. ప్రేమ స్వర్గాన్ని చూపిస్తుంది. పాతాళానికీ పడేస్తుంది.. ప్రేమ లోకంలో మునిగి తేలుతున్నప్పుడు ప్రియుడు, ప్రియురాలు తప్ప మిగిలిన ప్రపంచమంతా శూన్యం అనిపిస్తుంది. దూరమైనప్పుడు జీవితమే తలకిందలైందన్న భావన కలుగుతుంది. పాకిస్థాన్‌కు చెందిన సీమాకి కూడా అదే అనిపించింది. ప్రియుడిని దూరం చేసుకోకుడదని బలంగా డిసైడ్ అయ్యింది. ఓవైపు కలిసున్న రోజులు చిత్రహింసలు పెట్టిన భర్త..ఇక అతడు తన జీవితంలో రాడని తెలుసిన నిజం.. మరోవైపు రోజూ తన మాటలతోనే ప్రేమను పంచే ఇండియాకు చెందిన సచిన్..వీరిలో ఒకరితోనే జీవించాలనుకుంది. మూట ముల్లె సర్దుకుని నలుగురు పిల్లలతో గప్‌చుప్‌గా ఇండియాలోకి ఎంటర్ ఐపోయింది. తర్వాత ఏం జరిగింది..? అసలు సీమా, సచిన్ కథేంటి..? బతకలేక..చావలేక..: పాకిస్థాన్‌లో బాల్య వివాహాలు సర్వసాధారణంగానే జరుగుతుంటాయి. చిన్నతనంలోనే పెళ్లి చేసేయడం.. భర్తతో పంపించేయడంతో ఎంతో విలువైన బాల్యాన్ని ఛిద్రం అవుతుంటుంది. తీరా చేసుకున్న భర్త మంచి వాడు అవ్వకపోతే ఆ నరకం భరించరానిదిగా మారుతుంది. సీమాకు కూడా అదే జరిగింది. డబ్బు ఉందని సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిపించారు సీమా తల్లిదండ్రులు. అతను కేవలం సీమాను ఓ బొమ్మలానే చూశాడు. కోరికలు తీర్చుకోవడానికి..పిల్లల్ని కనడానికి మాత్రమే ఉన్న యంత్రంలా భావించాడు. నిత్యం వేధించడం..కొట్టడం..తన్నడం..ఇలా రోజూ నరకం చూపించేవాడు. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా చాలా కాలం పాటు ఎవరికీ చెప్పకుండా వీటన్నిటిని భరించింది. చివరకు భర్త ప్రవర్తన రోజురోజుకు మరింత దారుణంగా మారడంతో అతడిపై కేసు పెట్టింది. ప్రస్తుతం ఆమె గృహహింస బాధితురాలు. కేసు పెట్టిందన్న కోపంతో నాలుగేళ్ల నుంచి సీమాని కానీ..పిల్లలను కానీ కనీసం చూడటానికి కూడా రాలేదు ఆమె భర్త. సీమా(రైట్) పబ్జీ కలిపిన బంధం: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ ప్రేమలు ఎక్కువయ్యాయి. అందులో కొంతమంది మోసపోతుంటే మరికొందరు మాత్రం తమ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. ఇలా సక్సెస్, ఫెయిల్యూర్ రెండు ఉన్న ఫ్లాట్‌ఫామ్ ఆన్‌లైన్ లవ్. యూపీలోని నోయిడాకు చెందిన సచిన్‌కు సీమాతో ఆన్‌లైన్ గేమ్ పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సీమా కంటే సచిన్ ఐదేళ్లు చిన్నవాడు. ఇలా మతం గోడలను, సరిహద్దులనే కాదు.. సమాజంలో తిష్ట వేసుకొని కుర్చున్న అనేక స్టీరియోటైప్ కాన్సెప్ట్స్‌ని ఈ ప్రేమ బ్రేక్ చేసింది. ఒక్క రోజూ కూడా ఇద్దరు మాట్లాడుకోకుండా ఉండలేకపోయేవాళ్లు. చివరికి కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఇండియా-పాకిస్థాన్ మధ్య వైరం ఎలా ఉందో వాళ్లకి తెలియనది కాదు.. కానీ కలిసే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తన నలుగురి పిల్లలతో ముందుగా నేపాల్ వెళ్లిన సీమా అక్కడ నుంచి ఇండియాలోకి ప్రవేశించింది. తర్వాత ఏం జరగబోతోంది..? అక్రమంగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సీమా నేరుగా సచిన్ దగ్గరకే వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి ఒకటే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. సీమా పాకిస్థాన్‌కు చెందిన మహిళ అని ఎవరికి తెలియకుండా సచిన్ జాగ్రత్త పడ్డాడు. కానీ చుట్టూ ఉన్నవాళ్లకి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు సచిన్, సీమాను అదుపులోకి తీసుకున్నారు. చట్టప్రకారం సీమా, సచిన్ చేసింది తప్పు. అందుకే ఈ విషయం ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. మరి చూడాలి కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో..! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి