Yashoda Jayanti: తల్లులకు ప్రత్యేకమైన రోజు..! పిల్లల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ఇలా చేయండి..!

మార్చి1న శ్రీకృష్ణుని తల్లి యశోదా జయంతి. తల్లి, బిడ్డల మధ్య ప్రేమకు ఈ పండుగ ప్రతిబింబం. యశోద జయంతి నాడు తల్లులు తమ బిడ్డల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. ఇలా కృష్ణుని బాలరూపాన్ని పూజిస్తూ ఉపవాసం ఉండటం వల్ల సంతాన కోరిక త్వరగా నెరవేరుతుందని నమ్ముతారు.

New Update
Yashoda Jayanti: తల్లులకు ప్రత్యేకమైన రోజు..! పిల్లల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ఇలా చేయండి..!

Yashoda Jayanti: హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష షష్ఠి తిథి నాడు యశోద జయంతిని జరుపుకుంటారు. ఈసారి యశోదా జయంతిని మార్చి 1న(శుక్రవారం) జరుపుకుంటున్నారు. ఈ రోజును శ్రీ కృష్ణుని తల్లి యశోద జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకగా జరుపుకుంటారు. యశోద శ్రీకృష్ణుడిని పెంచిన విషయం తెలిసిందే. అయితే కృష్ణుడు తల్లి దేవకి గర్భం నుంచి జన్మించాడని చెబుతుంటారు. ఇక యశోదా జయంతి పండుగను ఇస్కాన్ దేవాలయాలు ప్రత్యేకంగా జరుపుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కృష్ణుని ఆలయాలలో గొప్ప వైభవంగా సెలబ్రేట్ చేస్తాయి. ఈ రోజున తల్లులు తమ పిల్లల దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంటారు. ఈ పండుగను గుజరాత్, మహారాష్ట్రతో పాటు దక్షిణ భారత రాష్ట్రాల్లోనూ చాలా వైభవంగా జరుపుకుంటారు. యశోదా జయంతి ప్రాముఖ్యత, శుభ సమయం, పూజా విధానాన్ని తెలుసుకుందాం!

--> పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష షష్ఠి తిథి మార్చి 1, 2024 ఉదయం 6:21 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మార్చి 2, 2024 ఉదయం 7:53 గంటలకు ముగుస్తుంది. అందుకే ఈ సంవత్సరం యశోదా జయంతిని మార్చి 1, 2024 శుక్రవారం జరుపుకుంటున్నారు.

--> యశోదా జయంతి పండుగ అమ్మవారికి చాలా ప్రత్యేకంగా పరిగనిస్తారు. ఈ పండుగ తల్లి, బిడ్డల మధ్య ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఈ రోజున తల్లులు తమ బిడ్డల దీర్ఘాయువు కోసం ఉపవాసం ఉంటారు. యశోద, శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల సంతాన కోరిక త్వరగా నెరవేరుతుందని నమ్ముతారు.

పూజా విధానం:

--> యశోదా జయంతి రోజున ఉదయం స్నానం చేసి తల్లి యశోద, కృష్ణుడిని ధ్యానం చేయండి.

--> పూజ కోసం శ్రీకృష్ణుని ఒడిలో తల్లి యశోద చిత్రాన్ని ప్రతిష్టించండి.

--> తల్లి యశోద చిత్రపటం లేకపోతే, ఆమెను ధ్యానిస్తూ శ్రీకృష్ణుని ముందు దీపం వెలిగించండి.

--> తల్లి యశోదకు ఎరుపు రంగు చునారీని సమర్పించండి.

--> అలాగే యశోద తల్లికి స్వీట్లు, శ్రీకృష్ణుడికి వెన్న సమర్పించండి.

--> దీని తర్వాత తల్లి యశోద, శ్రీకృష్ణుని ఆరతి చేయండి. ఆ తర్వాత గాయత్రీ మంత్రాన్ని జపించండి.

--> పూజ ముగిసిన తరువాత మీ కోరికల కోసం ప్రార్థించండి.

ఇది కూడా చదవండి: నిమ్మకాయను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు