రాహుల్ గాంధీకి మంచి అమ్మాయిని వెతకండి.... సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు...!

రాహుల్ గాంధీ వివాహం గురించి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మంచి అమ్మాయిని చూడండని హర్యానా మహిళలతో ఆమె అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

New Update
రాహుల్ గాంధీకి మంచి అమ్మాయిని వెతకండి.... సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు...!

రాహుల్ గాంధీ వివాహం గురించి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు హర్యానాకు చెందిన మహిళలు వచ్చారు. ఆ సందర్బంగా వారితో సోనియా గాంధీ ముచ్చటించారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీకి వివాహం చేద్దామా అంటూ మహిళలు సోనియా దగ్గర ప్రస్తావన తీసుకు వచ్చారు. దీంతో మహిళలకు సోనియాగాంధీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించారు. ఆ సమయంలో హర్యానా మహిళలతో ఆయన మాట్లాడారు. మాటల సందర్భంగా తమకు ఢిల్లీ రావాలని అనిపిస్తోందని చెప్పారు. దీంతో వారిని సోనియా నివాసానికి రావాలని ఆహ్వానించారు. ఢిల్లీకి వస్తే వారితో కలిసి లంచ్ కూడా చేస్తానంటూ రాహుల్ గాంధీ వాళ్లకు మాట ఇచ్చారు.

ఇటీవల హర్యానా మహిళల బృందం ఢిల్లీకి వచ్చింది. రాజధాని ఢిల్లీలో పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం సోనియాగాంధీ ఇంటికి మహిళల బృందం వెళ్లింది. అక్కడ వారిని సోనియా కుటుంబం సాధరంగా ఆహ్వానించింది. అనంతరం వారితో కలిసి సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కలిసి లంచ్ కూడా చేశారు. మహిళలతో సోనియా కుటుంబ సభ్యులు ఆప్యాయంగా మాట్లాడారు.

సోనియా గాంధీతో మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళ రాహుల్ గాంధీ వివాహం గురించి ప్రస్తావించారు. దీంతో ఆమె రాహుల్ గాంధీకి తగిని అమ్మాయిని మీరే వెతికి పెట్టండని అన్నారు. ఆయన వివాహం మీరే ఎందుకు చేయకూడదు అని అన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు అది తెగ వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు