Loksabha Elections 2024: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫుల్ రిచ్.. ఆయన ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ తనకు రూ.5,785 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన తెలుగు రాష్ట్రాల నుంచి బరిలో నిలిచి అభ్యర్థుల్లో టాప్ ఆస్తులు ఉన్న వ్యక్తిగా నిలిచారు.

Loksabha Elections 2024: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫుల్ రిచ్.. ఆయన ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?
New Update

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఈ క్రమంలోనే గుంటూరు నుంచి లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ నామినేషన్ వేశారు. ఆయన తనకు రూ.5,785 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఆస్తులపై తెలుగునాట చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో బరిలో ఉన్న ధనిక ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గా భావిస్తున్నారు. ఈ మేరకు పెమ్మసానికి రూ.2,316 కోట్ల విలువైన చరాస్తులుండగా.. భార్య శ్రీరత్న పేరిట రూ.2,280 కోట్ల చరాస్తులు ఉన్నాయి. భార్యాభర్తలిద్దరికీ చెరో రూ.1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. చెరో రూ.519 కోట్ల అప్పులు ఉన్నాయి.

రూ.6.11 కోట్ల విలువైన కార్లు
పెమ్మసానికి రూ.6.11 కోట్ల విలువైన 4 కార్లు, బ్యాంకు ఖాతాలో చెరో రూ.5.9 కోట్లు ఉన్నాయి. మొత్తం 6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన సాగుభూమి, హైదరాబాద్‌లో రూ.28.1 కోట్ల భూమి, రూ.29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, దిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.6.82 కోట్ల భూమి ఉన్నాయి. శ్రీరత్న పేరిట కృష్ణాజిల్లాలో రూ.2.33 కోట్ల విలువ చేసే సాగుభూమి. దిల్లీలో రూ.34.82 కోట్ల విలువైన భవనం. అమెరికాలో రూ.28.26 కోట్ల నివాస భవనాలు ఉన్నాయి.

ఎంబీబీఎస్:
పెమ్మసాని చంద్రశేఖర్ ఇండియాలోనే ఎంబీబీఎస్ చదివారు. అనంతరం పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. మాస్టర్స్ పూర్తి చేసి జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. అలాగే మెడికల్ ఫీల్డ్‌లో స్థిరపడిపోయారు. పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. యూవరల్డ్ పేరుతో అమెరికాలో ఆన్ లైన్ ఎడ్యూటెక్ కంపెనీని పెమ్మసాని చంద్రశేఖర్ నడుపుతున్నారు. అయితే సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలిచారు పెమ్మసాని చంద్రశేఖర్.

#tdp #loksabha-elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe