జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఝాన్సీరెడ్డి సమక్షంలో ఈ రోజు జరుగుతున్న చేరికలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారంటూ ఫైర్ అయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో తమను ఇబ్బందిపెట్టిన వారిని ఇప్పుడు ఎలా చేర్చుకుంటారని ఝాన్సీరెడ్డిని కార్యకర్తలు ప్రశ్నించారు. గతంలోను నియోజకవర్గంలోని ఓ మండలాధ్యక్షుడి మార్పు అంశంపై సైతం ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా నాయకులు ఆందోళన చేశారు. తాజాగా మరో సారి సొంత పార్టీ నేతలే ఝాన్సీరెడ్డిపై తిరుగుబాటు చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది.
Congress Politics: ఝాన్సీరెడ్డికి షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి ఝాన్సీరెడ్డిపై మరో సారి సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు. బీఆర్ఎస్ నేతలను చేరికలను అడ్డుకున్నారు. ఝాన్సీరెడ్డి తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
New Update
Advertisment