/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Yashaswini-Reddy--jpg.webp)
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఝాన్సీరెడ్డి సమక్షంలో ఈ రోజు జరుగుతున్న చేరికలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారంటూ ఫైర్ అయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో తమను ఇబ్బందిపెట్టిన వారిని ఇప్పుడు ఎలా చేర్చుకుంటారని ఝాన్సీరెడ్డిని కార్యకర్తలు ప్రశ్నించారు. గతంలోను నియోజకవర్గంలోని ఓ మండలాధ్యక్షుడి మార్పు అంశంపై సైతం ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా నాయకులు ఆందోళన చేశారు. తాజాగా మరో సారి సొంత పార్టీ నేతలే ఝాన్సీరెడ్డిపై తిరుగుబాటు చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది.