/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Sanampudi-Saidireddy--jpg.webp)
రానున్న ఎంపీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ ఖాయమని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉందన్నారు. ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ మూడు కుటుంబాల పాలన సాగుతోందన్నారు. కొత్త వాళ్లు రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. మోదీ ప్రభంజనంలో నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ఆర్టీవీతో సైదిరెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.