రాయలసీమలో కీలక లోక్‌సభ స్థానం నంద్యాల. ఇక్కడ YCP నుంచి పోచా బ్రహ్మానందరెడ్డి, TDP నుంచి బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ కావడం బ్రహ్మానందరెడ్డికి కలిసొస్తుంది. ఆర్ధిక బలం కూడా ఆయనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం కూడా ఆయనకు ప్లస్ కానుంది.
ఇక టీడీపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి మొన్నటివరకు బీజేపీలో ఉండటంతో కూటమి బలం కలిసొస్తుంది. నంద్యాలలో టీడీపీ అసెంబ్లీ టికెట్ భూమా బ్రహ్మానందరెడ్డికి ఇవ్వకపోవడం శబరికి మైనస్ అవుతోంది. భూమా ప్రచారానికి దూరంగా ఉండటం ఆమె విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుంది.
ఇప్పటికే ఈ పార్లమెంట్ పరిధిలోని శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, డోన్ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో వైసీపీ విజయం సాధిస్తుందని మా స్టడీలో చెప్పాం. ఆళ్లగడ్డ, బనగానపల్లెలో మాత్రమే టీడీపీ గెలుస్తుంది. ఓవరాల్‌గా నంద్యాల పార్లమెంట్‌లో వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి గెలుస్తారని RTV స్టడీలో తేలింది.