అనంతపురం లోక్‌సభ విషయానికి వస్తే.. TDP అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ వాల్మీకి సామాజికవర్గం నేత. అనంతపురం పార్లమెంట్‌లో వాల్మీకి ఓటర్లు ఎక్కువగా ఉండటం కలిసొస్తుంది. లక్ష్మీనారాయణ హిందూపురానికి చెందిన లీడర్ అయినా... అనంతపురంలో టీడీపీ కూటమి క్యాడర్ ఆయన కోసం కష్టపడుతుండటం ప్లస్ అవుతుంది. YCP అభ్యర్ధి శంకర నారాయణకి కుల సమీకరణలు మైనస్ అవుతాయి.
శంకర నారాయణ కురుబ కావడంతో వైసీపీలోని వాల్మీకి సామాజికవర్గం నేతల్లో వ్యతిరేకత ఈయనకు మైనస్ అవుతోంది. అనంతపురం లోక్‌సభ పరిధిలోని రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, సింగనమల, కల్యాణదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో టీడీపీ అభ్యర్ధులు గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలిన విషయం తెలిసిందే.
తాడిపత్రి, అనంతపురం అర్బన్‌లో మాత్రమే వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా అనంతపురం లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్ధి అంబికా లక్ష్మీనారాయణ విజయం సాధిస్తారని RTV స్టడీలో తేలింది.