చిత్తూరు లోక్‌సభ సెగ్మెంట్ విషయానికి వస్తే.. టీడీపీ అభ్యర్ధి దగ్గుమళ్ల ప్రసాదరావు మాజీ ఐఆర్ఎస్ అధికారి, వ్యాపారవేత్త. ప్రచారంలో పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తుండటం ఆయనకి కలిసొచ్చే అంశంగా మారింది. స్థానికుడు కాదన్న వాదన దగ్గుమళ్లకి ఇబ్బందిగా మారింది. ఇక సిట్టింగ్ ఎంపీ, వైసీపీ అభ్యర్థి ఎన్.రెడ్డప్పకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సపోర్ట్ ఇవ్వడం బాగా కలిస్తోంది.
ఎంపీ నిధుల్ని ఖర్చు చేయలేదన్న విమర్శ ఉంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జరిగిన అవినీతి రెడ్డప్పకి మైనస్ . ఈ లోక్‌సభ పరిధిలోని నగరి, చిత్తూరు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో టీడీపీ గెలవబోతుందని మా స్టడీలో ఇప్పటికే చెప్పాం.
చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఎంపీ సీటులో టీడీపీ అభ్యర్ధి దగ్గుమళ్ల ప్రసాదరావు విజయం సాధిస్తారని RTV స్టడీలో తేలింది.