/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Bhatti-Renuka-Chowdary-jpg.webp)
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సారి రాజ్యసభ సభ్యురాలు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ రోజు నిర్వహించిన మీటింగ్ లో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. పదవులు కావాలి.. కానీ మీటింగ్‌లకు రారు అంటూ భట్టిని లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేశారు. దీంతో భట్టి వర్గీయులు భగ్గుమన్నారు. రేణుకా చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల సమక్షంలోనే ఈ వివాదం జరిగింది. దీంతో అలర్ట్ అయిన మంత్రులు కార్యకర్తలకు సర్దిచెప్పారు. రేణుకాచౌదరి, భట్టి విక్రమార్క చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. భట్టిని టార్గెట్ చేసుకుని అనేక సార్లు రేణుకాచౌదరి నేరుగానే విమర్శలు చేశారు. ఎంపీ ఎన్నికల వేళ బహిరంగంగా ఇలా విభేదాలు బయటపడడం ఖమ్మం పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది.
రేణుకాచౌదరి ఖమ్మం ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. గతంలో జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్ లో చక్రం తిప్పారు రేణుకాచౌదరి. 2018లోనూ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ సారి కూడా పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఆమెకు రాజ్యసభ అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆమెను ఖమ్మం పాలిటిక్స్ నుంచి దూరం చేసేందుకే కొందరు ముఖ్య నేతలు ఇలా చక్రం తిప్పారన్న ప్రచారం కూడా ఉంది.
అయితే.. రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన తర్వాత కూడా రేణుకా చౌదరి ఖమ్మం పాలిటిక్స్ నుంచి దూరం కాలేదు. ఎంపీ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. జిల్లా పాలిటిక్స్ లో తన పట్టు తగ్గకుండా చూసుకుంటున్నారు రేణుకాచౌదరి. ఈ క్రమంలోనే నేరుగా డిప్యూటీ సీఎం టార్గెట్ గానే విమర్శలు గుప్పించి సంచలనం సృష్టించారు.