మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రఘునందన్‌రావు. తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, కేసులు, వ్యక్తిగత వివరాలను పొందపరిచారు. తనకు 21.07 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు రఘునందన్‌రావు. ఇందులో చరాస్తులు 9.13 కోట్లు కాగా.. స్థిరాస్తులు 12.94 కోట్లుగా చూపించారు. తనకు 12.11 కోట్ల రుణాలు ఉన్నట్లు ప్రకటించారు.
28 కేసులు..
తనపై మొత్తం 28 కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించారు రఘునందన్. ఇంకా చేతిలో 2.5 లక్షల నగదు, బ్యాంకులో 5.2 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత అడ్వాన్సుల కింద 3.14 కోట్ల ఇచ్చినట్లు తెలిపారు. 4 తులాల బంగారం, భార్య మంజులాదేవికి 10 తులాల బంగారం, ఒక డైమండ్ నెక్లస్ ఉన్నాయన్నారు.
46.25 ఎకరాల భూమి..
తన కుటుంబానికి 46.25 ఎకరాల వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస భవనాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు రఘునందన్‌రావు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి ఆర్వింద్ పోటీ చేస్తున్నారు. తనకు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తం చరాస్తులు 60.08 కోట్లు ఉన్నాయన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు లేవన్నారు. తన దగ్గర ప్రస్తుతం రూ.2.75 లక్షలు, భార్య చేతిలో రూ.3 లక్షలు ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని వాణిజ్య, నివాస భవనాల విలువ రూ.49.81 కోట్లుగా ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు ఆర్వింద్. మొత్తం 30.66 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు.
మొత్తం 22 కేసులు..
తనపై 22 కేసులున్నాయని తెలిపారు అర్వింద్. విశ్వసామాన్యు, జిఫీ టెక్ సొల్యూషన్స్, మష్రూమ్ ఇంపెక్స్, అరిచ్ నేచురల్ రిసోర్సెస్, ధర్మపురి కన్‌స్ట్రక్షన్స్, సామాన్యు ఇన్‌ఫ్రా, సవిన్ డెల్టా ప్రాజెక్ట్‌ల్లో వాటాలున్నాయన్నారు. సొంతంగా 45.25 కోట్ల అడ్వాన్సులు ఇచ్చినట్లు వెల్లడించారు.
మొత్తం 85 తులాల బంగారం..
తన సతీమణి దగ్గర 85 తులాల బంగారు ఆభరణాలున్నాయన్నారు అర్వింద్. దీంతో పాటు తన దగ్గర రెండు వాహనాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.