/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Mallareddy-jpg.webp)
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ తో మల్లారెడ్డి అన్న మాటలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అవును ఈటల గెలుస్తున్నాడు అన్నా తప్పేంటి? అని వాదిస్తున్నారు. లేకపోతే ఓడిపోతవ్ అని చెప్పాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఎవరన్నా చెప్తాడా నువ్వు ఓడిపోతున్నవ్ అని కవర్ చేసుకుంటున్నారు మల్లారెడ్డి. ఏదో ఎంకరేజ్ చేయడానికి అలా చెప్పానని అంటున్నారు.
ఇంతటితో ఆగకుండా ఈటల రాజేందర్ పై విమర్శలు సైతం స్టార్ట్ చేశారు. ఈ రోజు మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈటల మల్కాజ్‌గిరికి ఏం చేశాడని గెలుస్తాడు? ఫైర్ అయ్యారు. ఈటలకు క్యాడర్ లేదు, లీడర్ లేడు, ఓటర్ లేడని ఎద్దేవా చేశారు. ఈటల ఏమైనా లోకలా?, ఏమైనా పనులు చేశాడా? అని ప్రశ్నించారు మల్లారెడ్డి. మల్కాజ్‌గిరికి ఈటలకు సంబంధమే లేదన్నారు. కేసీఆర్‌తోనే ఈటల పెద్దగైండన్నారు. అంతకుముందు ఏమీ లేకుండే..కోడిగుడ్లు అమ్ముకునేటోడంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు మల్లారెడ్డి.