AP Politics: నా కన్నా మంచి వాళ్లకు టికెట్ ఇస్తేనే ఓకే: జగ్గంపేట ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
ఎమ్మెల్యే టికెట్ విషయంలో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకన్నా మంచి వారికి టికెట్ ఇస్తే కలిసి పని చేస్తానన్నారు. ఇంకో మూడు నెలలు తానే ఎమ్మెల్యేను అని అన్నారు చంటిబాబు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు (Jyothula Chantibabu) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. జగ్గంపేట ఎమ్మెల్యేగా జగన్ (AP CM Jagan) తనకు ఒక్క అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడున్న సమయంలో పొలిటికల్ ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయన్నారు. తనకన్నా బెటర్ గా ఉండి, పార్టీకి పనిచేసే వాళ్ళను తీసుకొస్తే కలిసి పనిచేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తాను ఎప్పుడూ స్వాగతిస్తానని స్పష్టం చేశారు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాను ఎమ్మెల్యే, లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యే అనేటట్లుగా ఇబ్బందులు లేకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రకరకాల కామెంట్స్ రావడం సహజం అన్నారు. ఇది కూడా చదవండి:YS Sharmila: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ లోకి వస్తామని ఎవరు చెప్పారు? రానివ్వమని ఎవరు అంటారు? అని ప్రశ్నించారు. తోట నరసింహం తనకు గతంలో కోఆపరేట్ చేశారన్నారు. అందరం కలిసి పనిచేస్తం అని అన్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే అప్పుడు ఆలోచిస్తానన్నారు. రాజీనామా చేసిన వాళ్లలో తనకు అనుకూలంగా కాదు.. తోట నరసింహానికి వ్యతిరేకంగా రాజీనామా చేశారన్నారు.
తోట నరసింహానికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తామన్నారు. పార్టీ గెలుపు కోసం సపోర్ట్ చేస్తామన్నారు. అందరినీ కలుపుకుని పోతే మంచిదన్నారు. ఇంకో మూడు నెలలు నేనే ఎమ్మెల్యే అని అన్నారు. టికెట్ ఇచ్చారని ప్రచారాలు కాకుండా నాయకుడు అనేవాడు నిబద్ధత కలిగి ఉండాలన్నారు. తాను నిర్ణయం తీసుకున్న తర్వాత మీడియాకు తన అభిప్రాయం చెబుతానన్నారు.
AP Politics: నా కన్నా మంచి వాళ్లకు టికెట్ ఇస్తేనే ఓకే: జగ్గంపేట ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
ఎమ్మెల్యే టికెట్ విషయంలో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకన్నా మంచి వారికి టికెట్ ఇస్తే కలిసి పని చేస్తానన్నారు. ఇంకో మూడు నెలలు తానే ఎమ్మెల్యేను అని అన్నారు చంటిబాబు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు (Jyothula Chantibabu) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. జగ్గంపేట ఎమ్మెల్యేగా జగన్ (AP CM Jagan) తనకు ఒక్క అవకాశం ఇచ్చారన్నారు. ఇప్పుడున్న సమయంలో పొలిటికల్ ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయన్నారు. తనకన్నా బెటర్ గా ఉండి, పార్టీకి పనిచేసే వాళ్ళను తీసుకొస్తే కలిసి పనిచేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తాను ఎప్పుడూ స్వాగతిస్తానని స్పష్టం చేశారు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాను ఎమ్మెల్యే, లేకపోతే ఇంకొకరు ఎమ్మెల్యే అనేటట్లుగా ఇబ్బందులు లేకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రకరకాల కామెంట్స్ రావడం సహజం అన్నారు.
ఇది కూడా చదవండి:YS Sharmila: షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు