Elections 2024: మాధవీలత ఓ మీడియా స్టార్.. ఆమె దందా ఇదే: బీఆర్ఎస్ అభ్యర్థి సంచలన ఇంటర్వ్యూ

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా స్టార్ అంటూ ధ్వజమెత్తారు. కరోనా సమయంలో వైద్యం పేరిట దోపీడి చేసిందన్నారు. ఎన్నికల తర్వాత మాధవీలత మళ్లీ కనిపించదన్నారు.

New Update
Elections 2024: మాధవీలత ఓ మీడియా స్టార్.. ఆమె దందా ఇదే: బీఆర్ఎస్ అభ్యర్థి సంచలన ఇంటర్వ్యూ

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మూడు నెలల ముందు వచ్చిన ఆర్టిస్ట్ అని బీఅర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మే 13న ఎన్నికలు అయిన మరుసటి రోజు నుంచే మాధవీలత రాజకీయాల్లో కనపడదన్నారు. ఆమె ఓ మీడియా స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. ఆస్పత్రి పేరుతో కరోనా కాలంలో మాధవీలత డబ్బులు దండుకుందని ఆరోపించారు. మెంబర్ షిప్ లేని ఆమెకు టికెట్ ఇవ్వడమే బీజేపీ చేసిన పెద్ద తప్పు అని అన్నారు. మాధవీలత గెలిస్తే ఏం చేస్తుందో చెప్పాలన్నారు. అంతే కానీ.. అనవసరమైన మాటలతో పాత బస్తీలో మతం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని హితవుపలికారు. ఆమెకు ఎలాంటి ముప్పు లేదననారు. మాటలతో ప్రధానిని సైతం బోల్తా కొట్టించిందన్నారు. యాగాలు చేసి డబ్బులు దండుకుందన్నారు శ్రీనివాస్ యాదవ్. ఆయన ఆర్టీవీతో మాట్లాడారు. పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు