Hero Venkatesh: రేపు ఖమ్మంలో హీరో వెంకటేష్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ అంశాలపై మాట్లాడుతారా?

రేపు హీరో వెంకటేష్ ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వెంకటేష్ తొలిసారిగా రాజకీయ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటుండడంతో.. ఆయన ఏం మాట్లాడుతారు? అన్న అంశంపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

New Update
Hero Venkatesh: రేపు ఖమ్మంలో హీరో వెంకటేష్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ అంశాలపై మాట్లాడుతారా?

రేపు ఖమ్మం జిల్లాలో (Khammam District) ప్రముఖ హీరో వెంకటేష్‌ (Hero Venkatesh) సందడి చేయనున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న రోడ్‌ షోలో వెంకటేష్‌ పాల్గొంటారు. అనంతరం కొత్తగూడెంలో పార్టీ శ్రేణులతో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని సందడి చేయనున్నారు. ఇప్పటికే వెంకటేష్ కూతురు ఆశ్రితా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వెంకటేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!

వెంకటేష్ సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఆయన ప్రచారంలో పాల్గొన్న సందర్భాలు లేవు. అయితే.. వెంకటేష్ వియ్యంకుడు రఘురాంరెడ్డి ఈ సారి ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో వియ్యంకుడి కోసం తొలిసారిగా ప్రచారంలో పాల్గొననున్నారు.

దీంతో వెంకటేష్.. రేపు ఏం మాట్లాడుతారు? కేవలం వియ్యంకుడిని గెలిపించాలనే కోరుతారా? ఇంకా ఇతర రాజకీయ అంశాలను కూడా మాట్లాడుతారా? అన్న అంశంపై ఫ్యాన్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. కొందరు వెంకటేష్ ఫ్యాన్స్ అయితే.. తమ హీరో ఈ ప్రచారం నుంచి పాలిటిట్స్ లోకి వచ్చేస్తారని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు