/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Gutha-Sukhender-Reddy-jpg.webp)
నల్లగొండ రాజకీయాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి నల్లగొండ లేదా భువనగిరి ఎంపీ ఎంపీగా తనకు అవకాశం కల్పించాలని పార్టీని కోరారు. అయితే.. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇతర సీనియర్ల నుంచి సహకారం లేని కారణంగా ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో అప్పటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల బీఆర్‌ఎస్, కేసీఆర్ తీరుపై గుత్తా తీవ్ర విమర్శలు చేశారు. గుత్తా విమర్శలకు పార్టీ వైపు నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వచ్చాయి. గుత్తాను టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ విమర్శలు గుప్పించారు. దీంతో ఇక పార్టీలో ఉండకూడదని గుత్తా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందున సుఖేందర్ రెడ్డి ఇప్పట్లో కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదు. ఆయన కుమారుడు ఒక్కరే హస్తం గూటికి చేరనున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ గుత్తా ఫ్యామిలీ దగ్గర అయితే కాంగ్రెస్ కి మరింత బలం చేకూరనుంది.